సంక్రాంతి తరువాత మొదలు కానున్న ఎవడు తరువాత షెడ్యూల్

సంక్రాంతి తరువాత మొదలు కానున్న ఎవడు తరువాత షెడ్యూల్

Published on Jan 4, 2013 3:30 AM IST

Yevadu
ఫిలిం నగర్ లో తాజా సమాచారం ప్రకారం రామ్ చరణ్ రాబోతున్న చిత్రం “ఎవడు” సంక్రాంతి తరువాత తరువాత షెడ్యూల్ మొదలు పెట్టుకోనుంది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కనుంది. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రామ్ చరణ్, శృతి హాసన్ మరియు ఏమి జాక్సన్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్ మరియు కాజల్ ప్రత్యేక పాత్రలు పోషించడం చిత్రానికి ప్రధాన ఆకర్షణ కానుంది. రానున్న ఈ షెడ్యూల్ లో రామ్ చరణ్ మరియు శృతి హాసన్ నడుమ ప్రధాన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. చిత్ర వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రం ఆద్యంతం ప్రేక్షకుడిని ఉత్కంఠకు గురి చేస్తుంది అని తెలుస్తుంది. స్టైలిష్ స్టార్ మరియు మెగా పవర్ స్టార్ ఒకే తెర మీద కనిపిస్తుండటం మొదటి సారి కావడంతో ఈ చిత్రం మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా ఈ చిత్రం ఈ ఏడాది విడుదల కానుంది.

తాజా వార్తలు