డిసెంబర్ 30న విశ్వరూపం ఆడియో విడుదల

డిసెంబర్ 30న విశ్వరూపం ఆడియో విడుదల

Published on Dec 29, 2012 10:23 PM IST

Vishwaroopam

కమల్ హాసన్ గత కొద్ది రోజులుగా “విశ్వరూపం” చిత్ర ప్రమోషన్ కోసం దేశం మొత్తం తిరుగుతున్నారు. ఈ చిత్రం ప్రధాన తారాగణం ఇప్పటికే న్యూ ఢిల్లీ, నాగ్ పూర్, ఇండోర్ మరియు లక్నో లో ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించారు. ఇప్పుడు హైదరాబాద్ కి రానున్నారు. రేపు(డిసెంబర్ 30) నొవోటేల్, హైదరాబాద్లో పత్రిక సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కమల్ హాసన్ చిత్రం గురించి కొన్ని విషయాలను చెప్పనున్నారు. ఇప్పటికే DTH లో విడుదల చేసే ప్రణాళికను గురించి చెప్పారు టాటా స్కై , ఎయిర్ టెల్, వీడియోకాన్ మరియు రెండు ఇతర DTH సర్వీస్ లు ఈ చిత్రాన్ని జనవరి 10న ప్రదర్శించనున్నాయి. ఈ చిత్ర ఆడియోని కూడా డిసెంబర్ 30న విడుదల చెయ్యనున్నారు. “విశ్వరూపం” చిత్రంలో కమల్ హాసన్, పూజ కుమార్, ఆండ్రియా మరియు రాహుల్ బోస్ ప్రధాన పాత్రలు పోషించారు.పివిపి సినిమాస్ బ్యానర్ తో ఈ చిత్రాన్ని కమల్ హాసన్ నిర్మించారు. శంకర్ ఎహాసన్ లాయ్ సంగీతం అందించగా ఈ చిత్రం తీవ్రవాదం మీద ఉంటుంది. ఈ చిత్రం తెలుగులో జనవరి ద్వితీయార్ధంలో విడుదల కానుంది.

తాజా వార్తలు