ఆ మహిళా క్రికెటర్ బన్నీకి వీరాభిమాని

ఆ మహిళా క్రికెటర్ బన్నీకి వీరాభిమాని

Published on Nov 21, 2020 2:02 PM IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ గత మూడు నాలుగేళ్లలో విపరీతంగా పెరిగింది. ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల్లోనే కాదు ఇతర రాష్ట్రాల్లో కూడ ఆయన క్రేజ్ బాగా పెరిగింది. కేరళ లాంటి రాష్ట్రంలో అక్కడి హీరోలకు సమానంగా బన్నీకి క్రేజ్ ఏర్పడింది. ఈమధ్య నార్త్ ఇండియా రాష్ట్రాల్లో కూడ ఆయనకు ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఇందుకు సాక్ష్యమే జాతీయ మహిళా క్రికెట్ జట్టులోని ఒక క్రికెటర్ తాను బన్నీకి వీరాభిమానినని చెప్పుకురావడం.

మహిళల క్రికెట్లో జాతీయ జట్టులో సభ్యురాలైన ప్రియా పూనియా తాజాగా సోషల్ మీడియాలో అభిమానులతో ఇంటరాక్ట్ అయ్యారు. ఆ టైంలో ఒక అభిమాని మీకు ఏ హీరో అంటే ఇష్టమని అడగ్గా ప్రియా పూనియా ఆలస్యం లేకుండా అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టమని చెప్పేసింది. దీంతో ఆశ్చర్యపోవడం అభిమానుల వంతైంది. ఎక్కడో రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన మహిళా క్రికెటర్ ఇంతలా బన్నీ పట్ల అభిమానం పెంచుకోవడం విశేషమే మరి. ఇకపోతే ప్రస్తుతం బన్నీ సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ చిత్రం చేస్తున్నారు. వచ్చే ఏడాదిలో ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది.

తాజా వార్తలు