‘ఆచార్య’ సెట్లో సోనూసూద్‌కి సత్కారం

‘ఆచార్య’ సెట్లో సోనూసూద్‌కి సత్కారం

Published on Nov 21, 2020 1:02 PM IST

కరోనా లాక్ డౌన్ సమయంలో నటుడు సోనూ సూద్ చేసిన సేవా కార్యక్రమాలను దేశం మొత్తం కొనియాడింది. పనులు లేక ఇళ్లకు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్న కొన్ని వందల మంది కూలీలను సొంత ఖర్చులరో బస్సులు ఏర్పాటుచేసి సొంత ఊళ్లకు చేర్చారు. అనేక మందికి భోజన వసతిని కల్పించారు. ప్రధాని సహా అనేకమంది రాజకీయ, సినీ, ఇతర రంగాల ప్రముఖులు సోనూ సూద్ సేవలను కొనియాడారు. ఇక మన తెలుగు సెలబ్రిటీలైతే సోనూసూద్‌ చేసిన సేవలకు గాను ఆయనకు సత్కారాలు, సన్మానాలు చేస్తున్నారు.

ఇటీవలే ‘అల్లుడు అదుర్స్’ సెట్లో నటుడు ప్రకాష్ రాజ్ సోనూసూద్‌ను శాలువా కప్పి సన్మానిస్తే తాజాగా ‘ఆచార్య’ సెట్లోనూ ఆయనకు సత్కారం జరిగింది. ఈ సినిమాలో ఒక కీలక పాత్ర చేస్తున్న ఆయన ఇటీవలే సెట్లో జాయిన్ అయ్యారు. సహా నటుడు తణికెళ్లభరణి, చిత్ర దర్శకుడు కొరటాల శివ కలిసి షూట్ బ్రేక్లో సోనూసూద్‌ని సత్కరించారు. కరోనా కష్ట కాలంలో సహృదయంతో వందలమందికి సహాయం అందించిన మన బంగారం మన మధ్యనే ఉన్నారు. అందరికీ డబ్బుంటుంది. స్పందించే మనసు కొందరికే ఉంటుంది. ఈరోజు సోనూ సూద్ అందరికీ స్ఫూర్తిగా నిలిచారు. అలాంటి వ్యక్తిని సత్కరించాలని అనిపించింది అంటూ శాలువా కప్పి సత్కరించి పంచముఖి ఆంజనేయస్వామి విగ్రహాన్ని అందించి మీరు చేస్తున్న పని పంచముఖాలుగా ప్రపంచమంతా విస్తరించాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. సోనూ సూద్ ఇప్పటికీ సహాయం కోసం తనవద్దకు వస్తున్న చాలామందికి చేతనైన సహాయం చేస్తూనే ఉన్నారు.

తాజా వార్తలు