బెంగుళూరు వెళ్లి నివాళులర్పించిన రామ్ చరణ్

బెంగుళూరు వెళ్లి నివాళులర్పించిన రామ్ చరణ్

Published on Nov 20, 2020 10:19 PM IST

చిత్తూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత డీకే సత్యప్రభ అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. గత కొన్నిరోజుల క్రితం కరోనా బారినపడి ఆమె బెంగుళూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. కరోనా నుండి కోలుకున్నప్పటికీ ఇతర ఆరోగ్య సమస్యల కారణంగా ఆసుపత్రిలోనే కన్నుమూశారు. ఆమె మృతి సంగతి తెలిసిన టీడీపీ క్యాడర్, అభిమానులు విషాదంలో మునిగిపోయారు. ఈ సంగతి తెలిసిన వెంటనే రామ్ చరణ్ హైదరాబాద్ నుండి బెంగుళూరుకు బయల్దేరి వెళ్ళారు.

నేరుగా వైదేహి ఆసుపత్రికి వెళ్లి సత్యప్రభగారి భౌతిక కాయానికి నివాళులర్పించారు. డీకే ఆదికేశవులు నాయుడు కుటుంబంతో చిరంజీవి కుటుంబానికి మంచి సాన్నిహిత్యం ఉంది. రామ్ చరణ్ సైతం ఆదికేశవులు, సత్యప్రభల కుమారుడు డీకే శ్రీనివాస్ తో సన్నిహితంగా ఉంటుంటారు. ఆ సాన్నిహిత్యంతోనే చరణ్ బెంగుళూరు వెళ్లి వారి కుటుంబాన్ని పరామర్శించారు. రామ్ చరణ్ ఆసుపత్రికి వచ్చారన్న సంగతి తెలియడంతో ఆయన్ను చూసేందుకు అభిమానులు భారీఎత్తున అక్కడికి చేరుకున్నారు.

తాజా వార్తలు