బన్నీను సుక్కు మరీ ఈ రేంజ్ లో చూపిస్తున్నారా.!

బన్నీను సుక్కు మరీ ఈ రేంజ్ లో చూపిస్తున్నారా.!

Published on Nov 20, 2020 9:00 AM IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “పుష్ప”. ఇంటెలిజెంట్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ పక్కా రఫ్ అండ్ రస్టిక్ డ్రామాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పైగా ఈ చిత్రాన్ని పాన్ ఇండియన్ ఫిల్మ్ గా ప్లాన్ చేస్తుండడంతో మరిన్ని అంచనాలు పెరిగాయి. ఇక ఇదిలా ఉంటే ఈ చిత్రం తాలూకా షూట్ ఇటీవలే మొదలైన సంగతి తెలిసిందే.

ఈ షూట్ మొదలు కావడంతోనే సాలిడ్ యాక్షన్ సీక్వెన్స్ తో మొదలయ్యింది. అయితే ఈ చిత్రంలో బన్నీ రోల్ ను సుకుమార్ చాలా సహజంగా డిజైన్ చేశారన్న సంగతి తెలిసిందే. ఎర్ర చందనం స్మగ్లింగ్ చేసే లారీ డ్రైవర్ గా కనిపించనున్నాడని తెలిసిందే. అందుకు తగ్గట్టే బన్నీను సరికొత్త మేకోవర్ లో చూపించారు.

కానీ సోషల్ మీడియాలో బన్నీ ఆన్ లొకేషన్ ఫోటో ఒకటి బయటకొచ్చింది. అది చూస్తే మాత్రం బన్నీను ఈ రేంజ్ లో చూపిస్తున్నారా అన్నట్టు ఉంది. మొత్తం రఫ్ లుక్ లో ఆయిల్ స్కిన్ టోన్ తో అసలెప్పుడు చూడని విధంగా కనిపించాడు.అలాగే బన్నీ ఫ్యాన్స్ కు కాస్త షాకింగ్ గా కూడా అనిపిస్తుంది. మరి విజువల్ గా మాత్రం ఖచ్చితంగా ఇంప్రెస్ చేసేలా ఉంటుందని చెప్పొచ్చు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు.

తాజా వార్తలు