పవన్ సాలిడ్ ప్రాజెక్ట్ అప్డేటేనా ఇది.?

పవన్ సాలిడ్ ప్రాజెక్ట్ అప్డేటేనా ఇది.?

Published on Nov 20, 2020 8:00 AM IST

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ హీరోగా నటిస్తున్న సాలిడ్ చిత్రాల్లో విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్లమూడితో తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రం కూడా ఒకటి. కేవలం కొద్ది రోజుల షూట్ ను మాత్రమే జరుపుకున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు కూడా నెలకొన్నాయి.

అయితే అప్పుడు పవన్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ప్రీ లుక్ పోస్టర్ కు భారీ రెస్పాన్స్ కూడా వచ్చింది. అంతే అక్కడ నుంచి మాత్రం ఆ చిత్ర యూనిట్ నుంచి మళ్ళీ ఎలాంటి అప్డేట్ కూడా రాలేదు. దానితో పవన్ అభిమానులు ఒక సాలిడ్ అప్డేట్ కోసమే ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

మరి ఈ తరుణంలోనే దర్శకుడు క్రిష్ తన ఇన్స్టా స్టోరీలో పెట్టుకున్న స్టేసే హాట్ టాపిక్ అయ్యింది. “ఈ శనివారం” అంటూ జస్ట్ పోస్ట్ చేసారు. ఇంక అంతకు మించి ఏమీ లేదు. దీనితో బహుశా అది పవన్ తో సినిమా కోసమే అని పవన్ ఫ్యాన్స్ చాలా వరకు ఫిక్సయ్యిపోయారు. మరి క్రిష్ నుంచి వచ్చే సాలిడ్ అప్డేట్ అదేనా లేక మరేమన్నానా అన్నది ఆసక్తికరంగా మారింది.

తాజా వార్తలు