చిరంజీవిని ఢీకొట్టబోయేది అతనేనా ?

చిరంజీవిని ఢీకొట్టబోయేది అతనేనా ?

Published on Nov 20, 2020 3:00 AM IST


మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ షూటింగ్ ఇప్పటికే మొదలైపోయింది. దర్శకుడు కొరటాల శివ చిరు మినహా మిగతా కీలక నటీనటులతో చిత్రీకరణ చేస్తున్నారు. త్వరలోనే మెగాస్టార్ షూటింగ్లో జాయిన్ కానున్నారు. అయితే మొదటి నుండి సినిమాలో చిరును ఢీకొట్టబోయే విలన్ ఎవరనే విషయమై పెద్ద చర్చ నడుస్తోంది. చాలాసార్లు బాలీవుడ్ నటుడ్ని తీసుకొస్తారని చెప్పుకున్నా ఇప్పుడు మాత్రం దక్షిణాది నటుడినే తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఆ నటుడు మరెవరో కాదు తమిళ స్టార్ అరవింద్ స్వామి. కొన్నేళ్ల గ్యాప్ తర్వాత సినిమాల్లోని రీఎంట్రీ ఇచ్చిన అరవింద్ స్వామి నెగెటివ్ రోల్స్ కూడ చేస్తున్నారు. ఆయన ప్రతినాయకుడిగా చేసిన ‘ధృవ, తని ఒరువన్, నవాబ్’ చిత్రాలు మంచి విజయాలను అందుకున్నాయి. అందుకే ఆయనైతేనే చిరు స్టేచర్ కు కరెక్టుగా ఉంటారని భావిస్తున్నారట దర్శక నిర్మాతలు. మరి ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

ఇందులో కాజల్ అగర్వాల్ కథానాయకిగా నటిస్తోంది. ఆమె కూడా డిసెంబర్ మొదటి వారంలో చిత్రీకరణలో జాయిన్ కానుంది. మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. రామ్ చరణ్ ఇందులో ఒక ముఖ్యమైన పాత్ర చేస్తుండటంతో అభిమానుల్లో అంచనాలు విపరీతంగా పెరిగాయి. కొరటాల తన ఎవరు గ్రీన్ ఫార్ములా అయినా కమర్షియాలిటీ, సోషల్ మెసేజ్ జోడించి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

తాజా వార్తలు