ధనుష్, సాయి పల్లవి జంటగా నటించిన ‘మారి 2’ చిత్రంలోని రౌడీ బేబీ సాంగ్ ఎంత పెద్ద హిట్టయిందో అందరికీ తెలుసు. యూట్యూబ్ నందు అత్యదిక వ్యూస్ పొందిన మొదటి సౌత్ ఇండియన్ వీడియో ఇదే. 100 కాదు 200 కాదు ఏకంగా 1000 మిలియన్ల వ్యూస్ సాధించింది ఈ పాట. పాట అంత గొప్పగా విజయం సాధించడానికి ప్రధాన కారణం సాయి పల్లవి. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్, డ్యాన్స్ మూమెంట్స్ పాటను ఎక్కడికో తీసుకెళ్లాయి. ఆమె కోసమే పాటను కొన్ని పదులసార్లు వీక్షించారు ప్రేక్షకులు. వీడియో కింద కామెంట్స్ చూసినా సాయి పల్లవికే ఎక్కువ ప్రశంసలు ఉంటాయి.
అలా పాట విజయంలో కీలక పాత్ర పోషించిన సాయి పల్లవిని ఆ చిత్ర నిర్మాణ సంస్థ వండర్ బార్ ఫిలింస్ నిర్లక్ష్యం చేయడం ఆ పాటను మెచ్చి హిట్ చేసిన అభిమానులకు అస్సలు నచ్చలేదు. నిర్మాణ సంస్థ పాట వన్ బిలియన్ వ్యూస్ సాధించిన సందర్బంగా కామన్ డీపీని రిలీజ్ చేసింది. అందులో ఒక్క ధనుష్ ఫోటో మాత్రమే ఉంది. సాయి పల్లవి ఫోటో కాదు కదా కనీసం పేరు కూడ లేదు. దీంతో అభిమానులే కాదు సామాన్య ప్రేక్షకులు సైతం నిర్మాణ సంస్థ మీద, ధనుష్ మీద విమర్శలు గుప్పిస్తున్నారు.