తన పర్ఫెక్ట్ డైరెక్షన్ తో ఒక్కసారిగా ఇండియా వైడ్ గుర్తింపు తెచ్చుకున్న మహిళా దర్శకురాలు సుధా కొంగర. తాను తీసింది తక్కువ సినిమాలే అయినా సినిమా పట్ల తనుకున్న కమిట్మెంట్ ను విజువల్ గా చూపించి ప్రతీ ఒక్కరినీ ఆశ్చర్యపరిచిన ఈ టాలెంటెడ్ దర్శకురాలి కోసం అన్ని సినీ ఇండస్ట్రీలలో హాట్ టాపిక్.
కోలీవుడ్ స్టార్ హీరో సూర్యతో చేసిన లేటెస్ట్ ఫిల్మ్ “ఆకాశం నీ హద్దురా” కు అనూహ్యమైన రెస్పాన్స్ వస్తుంది ఇంకా కొనసాగుతుంది. అయితే ఈ చిత్రం అనంతరం సుధా ఎలాంటి సినిమా చేస్తారు అన్నది కూడా ఇప్పుడు మంచి చర్చకు వచ్చింది. దీనితో ఈమె ఓ దక్షిణాది స్టార్ హీరోతో పాన్ ఇండియన్ లెవెల్లో సినిమా చెయ్యనున్నట్టుగా గాసిప్స్ వినిపిస్తున్నాయి.
అలాగే ఈ రేస్ లో ఇళయ థలపతి విజయ్ మరియు థలా అజిత్ ల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. మరి ఈ ఇద్దరిలో ఎవరితో చేసినా సరే సుధా కొంగర పాన్ ఇండియన్ లెవెల్లో సెన్సేషన్ నమోదు చెయ్యడం కన్ఫర్మ్ అని చెప్పాలి. మరి సుధా నుంచి నిజంగానే ఒక పాన్ ఇండియన్ లెవెల్ సినిమా ఉందో లేదో చూడాలి.