ఈరోజు బిగ్ బాస్ హౌస్ లో మరింత ఎమోషన్!

ఈరోజు బిగ్ బాస్ హౌస్ లో మరింత ఎమోషన్!

Published on Nov 19, 2020 4:05 PM IST

గత వారాంతం మెహబూబ్ దిల్ సే ఎలిమినేషన్ తోనే బిగ్ బాస్ సీజన్ హౌస్ అంతా విపరీతమైన ఎమోషనల్ అయ్యిపోయింది. ఆ తర్వాత మళ్ళీ నామినేషన్స్ లో విపరీతంగా హీటెక్కింది. కానీ బిగ్ ఇచ్చిన ఫ్యామిలీ మెంబర్స్ గిఫ్ట్ తో మాత్రం ఒక్కసారిగా అంతా మళ్ళీ మారింది. పలువురు కంటెస్టెంట్స్ యొక్క తల్లులను పంపడంతో మంచి వినోదంతో పాటుగా కంటెస్టెంట్స్ కూడా విపరీతమైన ఎమోషనల్ అయ్యారు.

ఇక ఈరోజు ఎపిసోడ్ చూస్తే మరింత ఎమోషనల్ అవ్వడం ఖాయం అని చెప్పాలి. షోయెల్ తండ్రి అలాగే లాస్య కొడుకు మరియు భర్త రావడం చివర్లో మోనాల్ తల్లి మాట్లాడ్డం ఒక్కసారిగా అందరినీ మరింత ఎమోషనల్ చేసేశాయి. మొత్తానికి మాత్రం ఈ వారం కంటెస్టెంట్స్ యొక్క విపరీతమైన భావోద్వేగాలతో నడుస్తుంది అని చెప్పాలి. మరి ఈరోజు ఫుల్ ఎపిసోడ్ ఎలా ఉంటుందో చూడాలి.

తాజా వార్తలు