బాలీవుడ్ కండల వీరుడికి కరోనా సెగ.!

బాలీవుడ్ కండల వీరుడికి కరోనా సెగ.!

Published on Nov 19, 2020 11:01 AM IST

మన ఇండియన్ సినీ మార్కెట్ లోనే పెద్దది అయినటువంటి సినీ ఇండస్ట్రీలో ఆల్ టైం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ స్టార్ హీరో ఎవరన్నా ఉన్నారు అంటే అది బాలీవుడ్ కండల వీరుడుగా పిలవబడే సల్మాన్ ఖాన్ అనే చెప్పాలి. సల్లూ భాయ్ సినిమాల కోసం కానీ వాటి బాక్సాఫీస్ వసూళ్ల కోసం కానీ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

అయితే ఈ ఏడాది కరోనా వల్ల వారి ఇండస్ట్రీకు కూడా భారీ నష్టాలే వచ్చాయి. పైగా కరోనా బారిన కూడా పడ్డారు. అలా ఇప్పుడు సల్మాన్ ఖాన్ కూడా కరోనా సెగ తగిలినట్టు తెలుస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే సల్మాన్ తాలూకా పర్సనల్ కార్ డ్రైవర్ కు మరియు మరో ఇద్దరు స్టాఫ్ కు కరోనా పాజిటివ్ వచ్చిందట.

దీనితో సల్మాన్ ఏమాత్రం ఆలోచించకుండా తాను అలాగే తన కుటుంబీకులని 14 రోజుల పాటు ఐసోలేషన్ లో ఉంచుకున్నట్టు తెలుస్తుంది. తనకి వచ్చింది రానిది పక్కన పెడితే సల్మాన్ తీసుకున్న ముందు జాగ్రత్త మంచిదే అని చెప్పాలి. అలాగే కరోనా తీవ్ర రూపంలో ఉన్నప్పుడు సల్మాన్ వేలాది మంది ప్రజలకు రేషన్ పంపిణీ చేసిన సంగతి తెలిసిందే.

తాజా వార్తలు