“రాధే శ్యామ్” టీం మొదటికే ఫిక్స్ అయ్యారా.?

“రాధే శ్యామ్” టీం మొదటికే ఫిక్స్ అయ్యారా.?

Published on Oct 17, 2020 7:01 AM IST

ఈ అక్టోబర్ నెల మొదలు కావడంతోనే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియాలో ప్రభాస్ బర్త్ డే మంత్ గా రచ్చ మొదలు పెట్టేసారు. ఇదే క్రమంలో ఈ అక్టోబర్ 23 ప్రభాస్ పుట్టినరోజు కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే ఈ స్పెషల్ డే రోజున ప్రభాస్ నటిస్తున్న మూడు భారీ చిత్రాలు నుంచి ఏదొక అప్డేట్ కోసం వారు ఎక్కువ ఎదురు చూస్తున్నారు.

కానీ రాధాకృష్ణ తో తీస్తున్న “రాధే శ్యామ్” సినిమా విషయంలో మాత్రం ఇంకాస్త ఎక్కువే ఆశిస్తున్నారు. షూట్ దాదాపు పూర్తి కావస్తున్న నేపథ్యంలో మేకర్స్ నుంచి టీజర్ వస్తుంది అని ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు. కానీ అంతకు ముందు అంతా ఈ చిత్రం నుంచి ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్ గా కేవలం మోషన్ పోస్టర్ వస్తుంది అని గట్టి టాక్ వినిపించింది.

అలా ఇప్పుడు ఫైనల్ గా చిత్ర యూనిట్ మొదట అనుకున్న మోషన్ పోస్టర్ నే విడుదల చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మేకర్స్ కూడా బహుశా ఈ ప్రకటననే చేయొచ్చని టాక్. మరి ఆసక్తికరంగా మారిన ఈ అంశంపై సరైన క్లారిటీ వచ్చే వరకు ఆగక తప్పదు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ వారు భారీ బడ్జెట్ తో పాన్ ఇండియన్ లెవెల్లో ప్లాన్ చేస్తున్నారు.

తాజా వార్తలు