బోల్డ్ రోల్ కు తెలుగు హీరోయిన్ డబ్బింగ్ !

బోల్డ్ రోల్ కు తెలుగు హీరోయిన్ డబ్బింగ్ !

Published on Oct 11, 2020 7:13 PM IST

తెలుగు సినిమాల్లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన తెలుగు హీరోయిన్స్ మాత్రం పెద్దగా ఎవ్వరూ కనిపించరు. అందం అభినయం ఉన్నప్పటికీ స్టార్ హీరోయిన్ గా ఎదగలేకపోయినవారి లిస్ట్ ప్రస్తుతం పెద్దదే ఉంది. అయితే ఈషా రెబ్బా మాత్రం స్టార్ డమ్ కోసం గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది. హిందీలో తెరకెక్కిన లస్ట్‌స్టోరీస్ వెబ్‌సిరీస్ ఎంత పాపులర్ అయిందో తెలిసిందే. ఈ వెబ్‌సిరీస్‌ లో అత్యంత బోల్డ్‌గా నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది కియారా ఆడ్వాణీ.

కాగా ఇప్పుడు ఆ బోల్డ్ పాత్రలో ఈషా రెబ్బా నటిస్తోంది. ప్రస్తుతం ఆ పాత్రకు ఆమె స్వయంగా డబ్బింగ్ చెప్పింది. దర్శకుడు సంకల్ప్ రెడ్డి తెలుగులో చేస్తోన్న ఈ రీమేక్‌ ఎపిసోడ్ కి దర్శకత్వం వహిస్తున్నాడట. మరి ఈషా ఏ రేంజ్ గ్లామర్ గా కనిపించనుందో చూడాలి. అన్నట్టు సోషల్ మీడియాలో ఈ మధ్య ఈషా రెబ్బా గ్లామర్ స్టిల్స్ బాగా వదులుతుంది. ఆ స్టిల్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి కూడా.

తాజా వార్తలు