“RRR” కు మళ్ళీ బ్రేక్ వేసారా.?

“RRR” కు మళ్ళీ బ్రేక్ వేసారా.?

Published on Oct 9, 2020 5:44 PM IST

మన టాలీవుడ్ లో అసలు ఊహించనటువంటి మల్టీ స్టారర్ ను సాలిడ్ బ్యాక్ డ్రాప్ తో దర్శక ధీరుడు రాజమౌళి సెట్ చేసేసారు. “రౌద్రం రణం రుధిరం” అనే టైటిల్ తో తెలుగు నేలకు చెందిన ఇద్దరు స్వాతంత్ర సమరయోధుల పై తెరకెక్కిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ ను తెరకెక్కిస్తున్నారు.

అయితే ఈ చిత్రం కెన్నీ అనివార్య కారణాల చేత చాలానే బ్రేక్స్ తీసుకోవాల్సి వచ్చింది. కానీ ఎట్టకేలకు లాక్ డౌన్ నిభంధనలతో ఇటీవలే చిత్ర యూనిట్ షూట్ ను పునః ప్రారంభం చేసినట్టు అనౌన్స్ చేశారు. దీనితో తారక్ మరియు చరణ్ అభిమానులకు మళ్ళీ బూస్టప్ వచ్చినట్టు అయ్యింది.

సరే ఇపుడు అంతా బాగుంది అనుకుంటే ఇపుడు ఈ సినిమా షూట్ కు చిన్న బ్రేక్ పడ్డట్టు తెలుస్తుంది. తారక్ ఓ రెండు రోజులు బ్రేక్ తీసుకున్నట్టు తెలుస్తుంది. ఆ తర్వాత మళ్ళీ జక్కన్న షూట్ ను ప్రారంభించనున్నారట. అలాగే వచ్చే నవంబర్ లో బావువ్డ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ జాయిన్ కానుంది. ప్రస్తుతానికి అయితే మాత్రం తారక్ ఫ్యాన్స్ టీజర్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

తాజా వార్తలు