భారీ అనౌన్స్మెంట్ తో రానున్న ఈ టాప్ డైరెక్టర్.!

భారీ అనౌన్స్మెంట్ తో రానున్న ఈ టాప్ డైరెక్టర్.!

Published on Oct 9, 2020 3:32 PM IST

మన టాలీవుడ్ లో అలనాటి చరిత్రను చూపించాలని తపన పడే దర్శకుల్లో రాజమౌళితో పాటుగా మరో దర్శకుడు ఉన్నారు అతనే గుణశేఖర్. మాస్ చిత్రాలతో పాటుగా అద్భుతమైన టేకింగ్ మరియు భారీ సెట్స్ తో మెస్మరైజ్ చేసే ఈ దర్శకుడు ఇపుడు చాలా గ్యాప్ తీసుకున్నారు.

తాను లాస్ట్ గా తెరకెక్కించిన భారీ పీరియాడిక్ చిత్రం “రుద్రమదేవి” తర్వాత నుంచీ మరో సినిమా చెయ్యలేదు. ఆయన అన్నా అతని వర్క్ కోసం బాగా తెలిసిన వారు మాత్రం ఒక స్యూర్ షాట్ కం బ్యాక్ ఇవ్వాలని కోరుకుంటున్నారు. అయితే ఈ దర్శకుడు నుంచి ఒక బిగ్గెస్ట్ అనౌన్స్మెంట్ రానున్నట్టుగా తెలుపుతున్నారు.

దానిని ఈరోజు 7 గంటల 11 నిమిషాలకు రివీల్ చేస్తామని గుణశేఖర్ టీం తెలుపుతున్నారు. దీనితో ఆడియెన్స్ లో రుద్రమదేవి కి సీక్వెలా లేక రాణా తో ప్లాన్ చేసిన సినిమానా అని అప్పుడే టాక్ మొదలయ్యింది. మరి ఈ ప్రాజెక్ట్ ఏంటో ఆ భారీ ప్రాజెక్ట్ ఏమిటి అన్నది తెలియాలి అంటే కాసేపు వెయిట్ చెయ్యక తప్పదు.

తాజా వార్తలు