ట్రైలర్ టాక్ – హిందీ కాంచన “లక్ష్మీ బాంబ్” ఇలా ప్లాన్ చేశారేంటి!

ట్రైలర్ టాక్ – హిందీ కాంచన “లక్ష్మీ బాంబ్” ఇలా ప్లాన్ చేశారేంటి!

Published on Oct 9, 2020 2:05 PM IST

మల్టీ టాలెంటెడ్ రాఘవ లారెన్స్ దర్శకునిగా మరియు హీరోగా చేసిన హార్రర్ సిరీస్ “ముని” ఎంత పెద్ద హిట్టయ్యిందో తెలిసిందే. ఇప్పటికి నాలుగు వస్తే నాలుగు కూడా తెలుగు మరియు తమిళంలో సూపర్ హిట్స్ అయ్యాయి. అయితే ఈ సిరీస్ లో “కాంచన” అయితే విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కామెడీ, భయం, అంతకు మించిన మంచి సందేశంతో తెరకెక్కించిన ఈ చిత్రం అప్పట్లో భారీ హిట్టయ్యింది. ఇపుడు ఇదే చిత్రాన్ని బాలీవుడ్ లో స్టార్ నటుడు అక్షయ్ కుమార్ హీరోగా కియారా అద్వానీ హీరోయిన్ గా లారెన్స్ దర్శకత్వంలో “లక్ష్మీ బాంబ్” గా తెరకెక్కించారు.

ఎప్పుడో పూర్తి కాబడిన ఈ చిత్రం కోసం బావువ్డ్ జనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. అక్కడ మోస్ట్ అవైటెడ్ సినిమాగా నిలిచిన ఈ చిత్రం నేరుగా స్ట్రీమింగ్ వరల్డ్ లో విడుదల కానుండగా ఇపుడు ట్రైలర్ ను మేకర్స్ వదిలారు. స్టోరీ ఎలాగో అందరికీ తెలిసిందే కాబట్టి కొట్టాడా చెప్పనక్కర్లేదు. కేవలం లొకేషన్స్ లో మార్పులు పెర్ఫవుమెన్స్ లను చూసుకున్నట్టైతే అక్షయ్ విశ్వ రూపమే చూపించారని చెప్పాలి.

అలాగే లారెన్స్ మార్క్ స్టైలిష్ మేకింగ్ అయితే ప్రతీ షాట్ లో కనిపిస్తుంది. ముఖ్యంగా ఒక సాంగ్ లో ఏమో కానీ దుబాయ్ షాట్స్ అండ్ ఓ సాంగ్ లో అయితే విజువల్స్ చాలా రిచ్ గా ఉండడమే కాకుండా అక్షయ్ సూపర్ స్టైలిష్ గా కనిపించారు. అలాగే సినిమాలోని కొన్ని కీ ఎపిసోడ్స్ లో అక్షయ్ మేకోవర్ కానీ నటన కానీ అవుట్ స్టాండింగ్ గా నిలవడం ఖాయం అని చెప్పాలి.అలాగే కియారా కూడా ప్రతీ షాట్ లో అద్భుతంగా కనిపించింది. ఇవన్నీ బాగున్నా అయితే ఈ ట్రైలర్ మాత్రం అందరికీ నచ్చకపోవచ్చు.

ఎందుకంటే ఆల్రెడీ కాంచన సినిమా చూసిన వారు ఖచ్చితంగా ఆ హర్రర్ ఫీల్ ను ట్రైలర్ లో కూడా చూడాలనుకుంటారు. కానీ దానంతటినీ ఎంటర్టైనింగ్ మ్యూజిక్ బాగా డామినేట్ చేసినట్టు అనిపిస్తుంది. కామెడీ కూడా బాగానే వర్కౌట్ అయ్యేలా ఉంది. కానీ ట్రైలర్ మేకింగ్ లో అన్నిటితో పాటూ కొన్ని ఇంప్రెసివ్ హర్రర్ సీన్స్ కూడా యాడ్ చేసి ఉంటే ఖచ్చితంగా మంచి ఇంపాక్ట్ కలిగి ఉండేది. తనిష్క్ భాగ్చి, శశి మరియు ఖుషీ లు సంగీతం అందించిన ఈ చిత్రం వచ్చే నవంబర్ 9 న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో డైరెక్ట్ గా స్ట్రీమింగ్ రిలీజ్ తో పాటు పలు దేశాల్లో థియేట్రికల్ రిలీజ్ కూడా కానుంది.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

తాజా వార్తలు