మన టాలీవుడ్ లో మోస్ట్ ఎనర్జిటిక్ హీరోల్లో మాస్ మహారాజ్ రవితేజ కూడా ఒకరు. రవితేజ సెట్స్ లో చాలా ఎనెర్జిటిక్ గా ఉంటారని అతనితో పని చేసిన టెక్నిషియన్స్ కానీ హీరోయిన్స్ కానీ చాలా మంది తెలిపారు. అందుకే రవితేజ ఏజ్ తో సంబంధం లేకుండా సరికొత్త ఎనర్జీకి కేరాఫ్ అడ్రెస్ అయ్యారు.
దీనితో అలా రవితేజ తన ముందు చిత్రాల ఫలితాలతో సంబంధం లేకుండా ఇప్పుడు చేస్తున్న మాస్ ట్రీట్ “క్రాక్” కు కూడా రెట్టింపు ఎనర్జీ తో రెడీ అవుతున్నారు. ఇప్పటికే చాలా మేర షూట్ ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఇపుడు ఫైనల్ ఫైనల్ షూట్ కు రెడీ అయ్యింది. ఆ విషయాన్ని ఇటీవలే దర్శకుడు గోపీచంద్ మలినేని తెలిపారు.
అయితే ఇపుడు రవితేజ కూడా అన్లిమిటెడ్ ఎనర్జీతో ఇపుడు లేటెస్ట్ షూట్ లో పాల్గినేందుకు రెడీ అయ్యినట్టు మేకర్స్ చెబుతున్నారు. అందుకు సంబంధించిన ఫోటోను కూడా షేర్ చేశారు. షూట్ కు రెడీ అయ్యి అద్దం ముందు నించున్న పవర్ లుక్ లో రవితేజ కనిపిస్తున్నారు.
ఈ చిత్రంతో అయినా సరే రవితేజ సాలిడ్ కం బ్యాక్ అందుకోవాలని చాలా మంది కోరుకుంటున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా మేకర్స్ వచ్చే ఏడాది సంక్రాంతి రేస్ లో నిలపాలని ట్రై చేస్తున్నారు.