మనవరాలి టాలెంట్‌ను మెగాస్టార్ చిరు ఎలా ఎంకరేజ్ చేస్తున్నారో చూడండి

మనవరాలి టాలెంట్‌ను మెగాస్టార్ చిరు ఎలా ఎంకరేజ్ చేస్తున్నారో చూడండి

Published on Oct 8, 2020 9:14 PM IST


కళల పట్ల పిల్లల ఇష్టా ఇష్టాలను, అభిరుచులను ప్రొత్సహించడంలో మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడూ ముందుంటారు. ఆయన ప్రోత్సాహం మూలానే మెగా ఫ్యామిలీ నుండి బోలెడంత మంది రెండవ తరం హీరోలు వెండితెర మీదికి వచ్చి గొప్పగా రాణిస్తున్నారు. చిరు కుమార్తె సుస్మిత కొణిదెల ఈరోజు ఇండస్ట్రీలో టాప్ కాస్ట్యూమ్ డిజైనర్ అయ్యారంటే వెనుక చిరు ప్రోత్సాహం ఎంతో ఉంది. అలాగే హీరోగా రాణిస్తూనే నిర్మాతగా మారి రామ్ చరణ్ తేజ్ సాధిస్తున్న విజయాల వెనుక తండ్రి స్థానంలో వెన్నుదన్నుగా నిలబడిన చిరు పాత్ర ఎంతో గొప్పది.

కుమార్తెలను, కుమారులను, మేనళ్లులనే కాదు మూడవ తరం వారసులను కూడ కళల పరంగా ఎంతగానో ప్రొత్సహిస్తున్నారు చిరు. చిరు మనవరాలు, సుస్మిత కుమార్తె సంహితకు నటనంటే ఎంతో ఇష్టం. ఆ ఇష్టాన్ని గుర్తెరిగిన చిరు దగ్గరుండి ఆ పాప చేత ప్రాక్టీస్ చేయిస్తున్నారు. తాజాగా సంహిత రుద్రమదేవి వేషధారణలో క్లిష్టమైన డైలాగ్స్ చెబుతూ అభినయం ప్రదర్శిస్తుంటే ముందు నిలబడి స్వయంగా వీడియో తీశారు చిరు.

అంతేకాకుండా తన మనవరాలి ప్రతిభను ప్రపంచానికి చూపించాలనే ఉద్దేశ్యంతో తన ఇన్స్టాగ్రమ్ ద్వారా వీడియో రిలీజ్ చేసి మనవరాలి ప్రతిభను మెచ్చుకుంటూ మురిసిపోయారు. వీడియోతో పాటు పిల్లల్లోని అభిరుచిని తల్లిదండ్రులు ప్రోత్సహిస్తే అది వారిలో ఉత్సాహాన్ని నింపుతుంది అంటూ మంచి సందేశం కూడ ఇచ్చారు.

https://www.instagram.com/tv/CGFN2xpj1AC/?igshid=1kdoizj7d1lh9

తాజా వార్తలు