డార్లింగ్ ఫ్యాన్స్.. రేపటి కోసం రెడీగా ఉండండి

డార్లింగ్ ఫ్యాన్స్.. రేపటి కోసం రెడీగా ఉండండి

Published on Oct 8, 2020 8:21 PM IST


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సైన్ చేసిన కొత్త చిత్రాల్లో నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ కూడ ఒకటి. ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ వైజయంతీ మూవీస్ బ్యానర్ మీద భారీ వ్యయంతో ఈ సినిమాను నిర్మించనున్నారు. లాక్ డౌన్ లేకపోయి ఉంటే ఈపాటికే మొదలుకావాల్సిన ఈ ప్రాజెక్ట్ వచ్చే సంవత్సరం నుండి పట్టాలెక్కనుంది. ఈ సినిమా గురించిన ఒక పెద్ద విశేషాన్ని త్వరలో చెబుతానని దర్శకుడు నాగ్ అశ్విన్ రెండు రోజుల క్రితం ప్రకటన చేశారు. అది విని అప్డేట్ ఏంటి, ఎప్పుడు బయటికొస్తుంది అని ఆసక్తిగా ఉన్నారు డార్లింగ్ అభిమానులు.

అయితే అభిమానులను ఎక్కువగా ఊరించడం, ఎదురుచూసేలా చేయడం ఎందుకనుకున్నారో ఏమో కానీ రేపు 10 గంటలకు ఆ విశేషాన్ని రివీల్ చేయనున్నారు. మాటిచ్చిన మూడురోజుల్లోనే అప్డేట్ ఇస్తున్నందుకు అభిమానులు నాగ్ అశ్విన్ మీద ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి ఆ బిగ్ అప్డేట్ సినిమా షూట్ ప్రారంభం గురించా లేకపోతే సినిమాలోని ప్రతినాయకుడు, ఇతర ముఖ్యతారాగణం లేదా సాంకేతిక నిపుణుల గురించా లేదా ప్రభాస్ చేయనున్న పాత్ర గురించా అనేది రేపే రివీల్ కానుంది. అప్డేట్ ఏదైనా సరే రేపు 10 గంటలకు సామాజిక మాధ్యమాల్లో ప్రభాస్ సినిమా వరల్డ్ వైడ్ ట్రెండ్ అవడం మాత్రం ఖాయం.
ఇకపోతే ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే కథానాయకిగా నటించనుంది. దక్షిణాది పరిశ్రమల్లో మాత్రమే కాదు బాలీవుడ్ పరిశ్రమలో సైతం ఈ ప్రాజెక్ట్ మీద భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

తాజా వార్తలు