లెజెండరీ క్రికెటర్ బయోపిక్ కు ఫిక్సయిన సేతుపతి!

లెజెండరీ క్రికెటర్ బయోపిక్ కు ఫిక్సయిన సేతుపతి!

Published on Oct 8, 2020 12:23 PM IST

మన దేశంలో ఆయా రంగాలకు చెందిన ప్రముఖుల జీవిత చరిత్రలపై ఎన్నో సినిమాలు ఇప్పటి వరకు మనం చూసాము. అలా తీసిన ఎన్నో బయో పిక్స్ లో దాదాపు అన్నీ సిల్వర్ స్క్రీన్ మీద హిట్టయినవే ఉన్నాయి. అయితే బయో పిక్స్ పర్వం మన దక్షిణాది మార్కెట్ లో ఊపందుకున్న సంగతి తెలిసిందే. అలా ఇపుడు మన దక్షిణాది నుంచి మరో అద్భుతమైన బయో పిక్ రెడీ అవుతుంది.

అది కూడా లెజెండరీ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ పై. శ్రీలంకకు చెందిన ఈ మైండ్ బ్లోయింగ్ స్పిన్నర్ కోసం మన దేశపు సినీ మరియు క్రికెట్ అభిమానులకు కొత్తగా చెప్పనక్కర్లేదు. మరి అలాంటి లెజెండ్ జీవిత చిత్రాల్లో తెలియని కోణాలను తన ద్వారా చూపేందుకు రెడీ అయ్యాడు కోలీవుడ్ ప్రముఖ హీరో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి. ఈ హీరోకు మన తెలుగు ఆడియెన్స్ లో కూడా మంచి గుర్తింపు ఏర్పడింది.

ఇపుడు టాలెంటెడ్ హీరో ఈ బరువైన భాధ్యతను టేకప్ చేసాడు. గత కొన్నిరోజుల నుంచి వార్తలు వినిపిస్తున్న ఈ చిత్రం ఇపుడు ఖరారు అయ్యింది. ఈ చిత్రానికి శ్రీపతి దర్శకత్వం వహించనుండగా తెలుగులో కూడా విడుదలకు రెడీ చేస్తున్నారు. అలాగే ఈ చిత్రాన్ని ట్రైన్ మోషన్ పిక్చర్స్ మరియు డార్ మోషన్ పిక్చర్స్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

తాజా వార్తలు