ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో “ఆచార్య” అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సైరా లాంటి భారీ పీరియాడిక్ వండర్ తర్వాత ఈ చిత్రం రానుండడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ లాక్ డౌన్ తో షూయ్ వాయిదా పడటంతో సినిమా విడుదల కూడా డిలే అయ్యింది.
ఇదిలా ఉండగా చాలా కాలం అనంతరం ఈ చిత్రంలో మెగాస్టార్ లుక్ ఎలా ఉండనుందో చిరు పుట్టినరోజు కానుకగా కొరటాల ఫస్ట్ లుక్ పోస్టర్ అండ్ మోషన్ పోస్టర్ టీజర్ ను రివీల్ చేసారు. అయితే ఇపుడు ఈ మన టాలీవుడ్ లో టీజర్స్ హవా ఒక్కసారిగా మొదలయ్యింది.
మన తెలుగు టాప్ హీరోస్ నటిస్తున్న వారి చిత్రాలకు సంబంధించి టీజర్లను మేకర్స్ ఇపుడు రెడీ చేస్తున్నారు. అందులోని ఒకదానికి ఒకటి తక్కువ గ్యాప్ తోనే రావడానికి రెడీ అవుతుంది. మరి ఈ రేస్ లో చిరు కూడా యాడ్ అవుతారా లేదా అని మెగా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు..
అయితే అందుకు ఇపుడు అవకాశాలు తక్కువే ఉన్నాయని చెప్పాలి. ఎందుకంటే ఈ చిత్రం షూట్ చాలానే బ్యాలెన్స్ ఉంది. సో ఇప్పుడప్పుడే టీజర్ అయితే వచ్చే సూచనలు లేవని చెప్పాలి. ఈ చిత్రానికి చిరు ఆల్ టైం హిట్ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ సంగీతం అందిస్తుండగా మ్యాట్నీ ఎంటెర్టైనెర్స్ వారు నిర్మిస్తున్నారు.