మన టాలీవుడ్ లో అపారమైన టాలెంట్ కలిగిన నటులకు ఎలాంటి కొదవ లేదు. మంచి టాలెంట్ ఉంటే కాస్త లేట్ అయినా సరే వారికి మంచి ఆఫర్స్ వస్తాయి. అలా మన టాలీవుడ్ లో ఎప్పటి నుంచో చిన్న చిన్న రోల్స్ చేస్తూ ఇపుడు హీరోగా కూడా చేస్తున్న యువ హీరో సిద్దార్థ్ జొన్నలగడ్డ.
మంచి టాలెంట్ కలిగిన ఈ నటుడు ఇప్పటికే చాలా చిత్రాల్లో హీరోగా నటించాడు. అలా తాను లేటెస్ట్ గా నటించిన “కృష్ణ అండ్ హిస్ లీల” చిత్రంతో ఆకట్టుకున్నాడు. ఇపుడు ఈ హీరోతో ప్రముఖ నిర్మాత సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగ వంశీ ఈ హీరోతో కలిసి పని చేయనున్నారట. ఈ యంగ్ ప్రొడ్యూసర్ ఇప్పటికే నితిన్ తో తీసిన “భీష్మ” మంచి హిట్టయ్యింది.
దీని తర్వాత కూడా వెంకీ అట్లూరితో “రంగ్ దే” చేస్తున్నారు. మరి ఇపుడు ఈ ప్రొడ్యూసర్ ఈ చిత్రం అనంతరం సిద్దార్థ్ తో ఒక క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ను ప్లాన్ చేస్తున్నారట. ఈ చిత్రానికి నూతన దర్శకుడు విమల్ కృష్ణ దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రం షూట్ కూడా తొందరలోనే మొదలు కానుండగా ఈ చిత్రానికి సంబంధించి మరింత సమాచారం రావాల్సి ఉంది.