సేఫ్ గా షెడ్యూల్ పూర్తి చేసేసిన నితిన్.!

సేఫ్ గా షెడ్యూల్ పూర్తి చేసేసిన నితిన్.!

Published on Oct 7, 2020 9:00 AM IST

“భీష్మ” లాంటి సాలిడ్ హిట్ తో అదిరిపోయే కం బ్యాక్ హిట్ ను అందుకున్న టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్ అదే జోరును తన నెక్స్ట్ సినిమాలతో కూడా కొనసాగించాలని రెడీ అయ్యాడు. అలా ఇప్పుడు నితిన్ చేస్తున్న పలు ప్రాజెక్టులపై మంచి అంచనాలు నెలకొనగా వాటిలో మొదటి వరుసలో ఉన్న చిత్రం “రంగ్ దే”.

దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఉండనుంది అని టీజర్ అండ్ పోస్టర్స్ చూస్తేనే అర్ధం అవుతుంది. ఇంకా కాస్త షూట్ భాగాన్ని మిగుల్చుకొని ఉన్న ఈ చిత్రం ఆ షూట్ ను కూడా కంప్లీట్ చేసుకుంటుంది. అలా లేటెస్ట్ గా చిత్ర యూనిట్ ఒక షెడ్యూల్ ను సేఫ్ గా పూర్తి చేసుకున్నట్టుగా నితిన్ తెలిపారు.

తన దర్శకుడు వెంకీ అట్లూరి, సినిమాటోగ్రాఫర్ మరియు హీరోయిన్ కీర్తి సురేష్ తో కలిపి ఉన్న పిక్ ను షెడ్యూల్ అనంతరం పోస్ట్ చేసి తెలిపారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం అందిస్తున్నారు. మొత్తానికి మాత్రం మేకర్స్ ఈ చిత్రాన్ని సంక్రాంతి రేస్ లో నిలిపేందుకు రెడీ చేస్తున్నారు.

తాజా వార్తలు