బన్నీ సెన్సేషన్..ఇక నెక్స్ట్ టార్గెట్ హాఫ్ బిలియనే!

బన్నీ సెన్సేషన్..ఇక నెక్స్ట్ టార్గెట్ హాఫ్ బిలియనే!

Published on Oct 7, 2020 8:00 AM IST

సోషల్ మీడియాలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు ఉన్న ఫాలోయింగ్ కోసం తెలిసిందే. భాషలు దాటి బన్నీ ఫాలోయింగ్ ఎప్పుడో భారీ స్థాయికి చేరుకుంది. అయితే అల్లు అర్జున్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన మ్యూజికల్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ “అల వైకుంఠపురములో”. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కాబడిన ఈ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

ఒక్క సినిమా పరంగా మాత్రమే కాకుండా సినిమా సంగీతం విషయంలో కూడా సెన్సేషనల్ హిట్టయ్యింది. థమన్ అందించిన బాణీలు పెద్ద అసెట్ అయ్యేసరికి వాటిని బన్నీ మరో లెవెల్ కు తీసుకెళ్లాడు. ముఖ్యంగా “బుట్టబొమ్మ” సాంగ్ అయితే ఇప్పటికీ అలా భారీ రికార్డులు నెలకొల్పుతూనే ఉంది. ఈ సాంగ్ లేటెస్ట్ గా మన తెలుగులో ఏకంగా 400 మిలియన్ వ్యూస్ ను టచ్ చేసి సెన్సేషనల్ రికార్డు నెలకొల్పింది.

ఇక దీని తర్వాత బన్నీ టార్గెట్ హాఫ్ బిలియనే అని చెప్పాలి. కేవలం ఇన్ని నెలల వ్యవధిలోనే ఎల్లలు చెరిపేసిన ఈ సాంగ్ ఇంకొన్నాళ్లలో ఆ ఫీట్ ను కూడా అందుకుంటుంది అన్ని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించిన ఈ పాటను అర్మాన్ మాలిక్ ఆలపించగా జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. వీటన్నిటి కలయికతో బన్నీ ఆన్లైన్ క్రేజ్ మరింత ప్లస్సయ్యింది.

తాజా వార్తలు