మెగాస్టార్ కోసం మెహర్ పర్ఫెక్ట్ ప్లానింగ్?

మెగాస్టార్ కోసం మెహర్ పర్ఫెక్ట్ ప్లానింగ్?

Published on Oct 3, 2020 2:34 PM IST

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివతో ప్లాన్ చేసిన చిత్రం “ఆచార్య”లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ చిత్రం తర్వాత చిరు రెండు రీమేక్ చిత్రాలను ప్లాన్ చేసుకున్నారు. అయితే వాటిలో వినాయక్ తో మరియు మెహర్ రమేష్ లతో తెరకెక్కించనున్నారు. వినాయక్ తో చేయనున్న “లూసిఫర్” రీమేక్ ఇప్పటికే రెడీ అయ్యిపోగా మెహర్ రమేష్ తో చేయనున్న “వేదాళం” కు కూడా అంతా సెట్టవుతుంది.

అయితే మెహర్ పక్కా ప్లానింగ్స్ లో ఉన్నారని తెలుస్తుంది. ప్రస్తుతం మెహర్ ఈ చిత్రానికి లొకేషన్స్ వేటలో ఉన్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఈ చిత్రానికి ఒరిజినల్ వెర్షన్ అయినటువంటి అజిత్ సినిమాలో కీలక ఎపిసోడ్స్ లోని లొకేషన్స్ లోనే తెరకెక్కించాలని అనుకుంటున్నారట. అలాగే ఈ చిత్రంలో చిరు సోదరి రోల్ కు సాయి పల్లవిని ఎంపిక చేశారన్న సంగతి తెలిసిందే. మరి ఈ చిత్రం ఎప్పుడు మొదలు కానుందో చూడాలి. ఈ చిత్రానికి మణిశర్మ తనయుడు సాగర్ సంగీతం అందివ్వనున్నట్టు టాక్.

తాజా వార్తలు