ఇప్పుడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న భారీ చిత్రాల్లో బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ ప్లాన్ చేసిన భారీ బడ్జెట్ చిత్రం “ఆదిపురుష్” కూడా ఒకటి. ఈ చిత్రాన్ని ఓంరౌత్ పర్ఫెక్ట్ ప్లానింగ్ ప్రకారం తెరకెక్కించనున్నారు. అందుకే ప్రతీ విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తూ ప్రతీ స్టెప్ కు కూడా మరింత అంచనాలు పెంచుతూ వస్తున్నారు.
అయితే ఈ మధ్య కాలంలో ఈ సినిమాకు సంబంధించి పలు గాసిప్స్ గుప్పుమన్నాయి. ఈ చిత్రానికి లెజెండరీ రైటర్ విజయేంద్ర ప్రసాద్ గారు రచనా పర్యవేక్షణ చేయనున్నారని టాక్ వచ్చింది. అయితే ఇప్పుడు ఇందుకు సంబంధించి మరో ప్రచారం కూడా జరుగుతుంది.
ఈ చిత్రానికి విజయేంద్ర ప్రసాద్ గారు కేవలం తెలుగు వెర్షన్ కు మాత్రమే సహకారం అందివ్వనున్నారని ప్రచారం జరుగుతుంది. మరి ఇందులో ఎంతవరకు నిజముందో కానీ ఈ టాక్ ప్రస్తుతం గట్టిగా వినిపిస్తుంది. ఈ భారీ ఇతిహాస చిత్రాన్ని దర్శకుడు 3డి టెక్నాలిజీలో మొత్తం 5 భాషల్లో ప్లాన్ చేస్తున్నారు. వచ్చే ఏడాది షూట్ మొదలు పెట్టి ఆ వచ్చే ఏడాది విడుదలకు ప్రయత్నిస్తున్నారు.