మన టాలీవుడ్ లో కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చెయ్యడంలో స్టార్ హీరోలు ఎప్పుడూ ముందుంటారు. అలాంటి వారిలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఒకరు. అయితే ఈ మధ్య కాలంలో చిన్నగా అయినా సరే పలు మంచి చిత్రాలు చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి. అలా వచ్చిన నూతన దర్శకుల్లో “పలాస 1978” అనే చిత్ర తెరకెక్కించిన దర్శకుడు కరుణా కుమార్ ఒకరు.
ఈ ఏడాది మార్చ్ లో విడుదల కాబడిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. దీనితో ఈ దర్శకునికి కూడా ఒక్కసారిగా మన టాలీవుడ్ లో మంచి గుర్తింపు వచ్చింది. ఇపుడు ఈ దర్శకుడు తీసిన సినిమా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ చిత్రాన్ని చూసాక దర్శకుణ్ణి అభినందించకుండా ఉండలేకపోయారు. ఈ సినిమా చూసిన వెంటనే మర్నాడు దర్శకుణ్ణి కలిసి వారి ఎంటైర్ టీమ్ కు స్పెషల్ గా కంగ్రాట్స్ చెప్పానని తెలిపారు.
ఈ వండర్ ఫుల్ చిత్రంతో మంచి సందేశం ఇచ్చారని మున్ముందు కూడా ఇలాంటి సినిమాల కోసం చూస్తున్నానని తనకు పర్సనల్ గా ఈ చిత్రం నచ్చింది అని బన్నీ దర్శకునికి ఒక మొక్కను ఇచ్చి తెలిపారు. అంతే కాకుండా ఇలాంటి కొత్త తరం దర్శకులు కొత్త నటీనటులు రావడం ఆనందంగా ఉందని నిర్మాతలు, టెక్నిషియన్స్ ఇలా అందరికీ బన్నీ స్పెషల్ థాంక్స్ తెలిపారు.
Soo glad such good directors and actors are coming up in new age Telugu films. My heart felt Congratulations to the Actors , Techs , Producers and the entire team . #palasa1978
— Allu Arjun (@alluarjun) October 2, 2020