మన టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ లేటెస్ట్ గా ఇంటెలిజెంట్ దర్శకుడు సుకుమార్ తో ఒక పాన్ ఇండియా ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్ట్ తో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ స్నేహితుడు యంగ్ ప్రొడ్యూసర్ కేదార్ సెలగంశెట్టి తన తొలి సినిమా నిర్మిస్తూ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. ఈ సందర్భంగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అభినందనలు తెలియజేశారు.
కేదార్ సెలగంశెట్టి అల్లు అర్జున్ మంచి స్నేహితులు. తన స్నేహితుడిని ఇండస్ట్రీకి సాదరంగా ఆహ్వానించారు అల్లు అర్జున్.ఇటీవలే స్టార్ హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు సుకుమార్ తో ఈ యువ నిర్మాత తన ఫాల్కన్ క్రియేషన్స్ సంస్థలో తొలి సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నారు. తాజాగా కలిసి పర్సనల్ గా విషెస్ తెలిపారు. ఆఅంతే కాకుండా సినిమా అనౌన్స్ మెంట్ రోజు మొక్కను బహుమతిగా అల్లు అర్జున్ పంపారు.