“సమిధ” చిత్రం తో టాలీవుడ్ లోకి మరొక డైరెక్టర్

“సమిధ” చిత్రం తో టాలీవుడ్ లోకి మరొక డైరెక్టర్

Published on Sep 30, 2020 2:00 PM IST

ప్రస్తుతం చాలా మంది లఘు చిత్రాలతో తమ టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంటున్నారు. అలా లఘు చిత్రాలతో తమ టాలెంట్ ను ప్రూవ్ చేసుకోవడం తో చాలా మంది ఇండస్ట్రీ లో ఎంతో మంది దర్శకులు గా సుస్థిర స్థానం ను సంపాదించుకున్నారు. అయితే ఇప్పుడు మర్మం, కనులు కలిశాయి లాంటి అయిదు లఘు చిత్రాలను తీసి, ఇప్పుడు సమిధ చిత్రం తో వెండితెరకు దర్శకుడి గా పరిచయం అవుతున్నారు సతీష్ మాలెంపాటి. అయితే సెప్టెంబర్ 30 న ఆయన పుట్టిన రోజు సందర్భంగా సమిధ చిత్రానికి సంబంధించిన టైటిల్ లోగో పోస్టర్ ను రిలీజ్ చేశారు.

ఈ సందర్భంగా సతిష్ మాలెంపాటీ మాట్లాడుతూ, గతం లో అయిదు షార్ట్ ఫిల్మ్స్ డైరెక్ట్ చేసిన విషయాన్ని వెల్లడించారు. అంతేకాక యాడ్ ఫిల్మ్స్ కు కూడా డైరెక్ట్ చేసినట్లు తెలిపారు. ఆ అనుభవం తో ఇప్పుడు ఒక మూవీ కి దర్శకత్వ బాధ్యతలు చేపట్టినట్లు వివరించారు. ఒక యదార్ధ గాథ ను ఇన్స్పిరేషన్ గా తీసుకొని మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ గా అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో సమిధ చిత్రం ను రూపొందిస్తున్నట్లు తెలిపారు. తన పుట్టిన రోజు సందర్భంగా సమిధ లోగో పోస్టర్ ను రిలీజ్ చేయడం చాలా హ్యాపీ గా ఉంది అని అన్నారు. అంతేకాక తనకు అవకాశం ఇచ్చిన అరుణం ఫిలిమ్స్ వారికి థాంక్స్ తెలిపారు. సమిధ అనేది అచ్ఛ తెలుగు పదం అని, ఈ కథకు హండ్రెడ్ పర్సెంట్ ఈ టైటిల్ యాప్ట్ అంటూ చెప్పుకొచ్చారు.

ఇది మంచి కంటెంట్ బేస్డ్ ఫిల్మ్ అని, చావు రెండు సందర్భాల్లో వస్తది ఎవరికైనా అనేది సినిమా క్యాప్షన్ అని అన్నారు. అయితే ఇదే పాయింట్ చుట్టూ కథ రన్ అవుతుంది అని, అన్వేషణ, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ చిత్రాల జోనర్ లో చాలా ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే తో ఈ సినిమా అందరినీ థ్రిల్ చేస్తుంది అని తెలిపారు. ఈ చిత్రంలో ప్రముఖ హీరో హీరోయిన్ లతో పాటుగా పోసాని కృష్ణమురళి, రవి కాలే తో పాటు మరి కొంతమంది ప్రముఖ నటీనటులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు అని అన్నారు. డిసెంబర్ లో షూటింగ్ ను ప్రారంభించి 2021 సమ్మర్ స్పెషల్ గా విడుదల చేస్తామని అన్నారు. ఈ చిత్రానికి సంగీతం భీమ్స్ సిసిరోలియో అందించనున్నారు.

తాజా వార్తలు