గత కొన్ని నెలల కితం బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మ హత్యా చేసుకున్న ఘటన ఎంతటి దుమారాన్ని రేపిందో అందరికీ తెలిసిందే. అక్కడ నుంచి ఇప్పటి వరకు ఈ కేసు విషయం ప్రతీ రోజు మన దేశంలో హాట్ టాపిక్ అవుతుంది. అలా ఇప్పటి వరకు బాలీవుడ్ లో ఎన్నో మలుపులు తిరుగుతూ వస్తున్న ఈ అంశం ఇపుడు టాలీవుడ్ లో కూడా హాట్ టాపిక్ అయ్యేలా ఉంది అని చెప్పాలి.
ఈ కేసులో మొదటి నుంచీ పెద్ద ఎత్తున వినిపిస్తున్న సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి కు సపోర్ట్ చేస్తూ తన అభిప్రాయాన్ని మంచు లక్షి ఇటీవలే తెలిపారు. ఇపుడు మరో ఊహించని పోస్ట్ ను సుశాంత్ ఇష్యూ పై పెట్టారు. మన దేశంలో ఇపుడు కోవిడ్ 19 కంటే కూడా సుశాంత్ సింగ్ కేసు ఇష్యూ విషయం కోసమే ఎక్కువ వర్రీ అవుతున్నారని ఇదే నిజం అని ఒక పై చార్ట్ తో తెలిపారు. మరి మంచు లక్ష్మి రియాక్షన్ ఎటు దారి తీస్తుందో చూడాలి.
This is truth based on facts! pic.twitter.com/OwnQM8HBmM
— Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) September 9, 2020