అనుష్క ‘నిశ్శబ్దం’ పై ఎనౌన్స్ మెంట్ ఎప్పుడు ?

అనుష్క ‘నిశ్శబ్దం’ పై ఎనౌన్స్ మెంట్ ఎప్పుడు ?

Published on Sep 7, 2020 10:06 PM IST


కరోనా దెబ్బకు సినిమాలు కూడా నేరుగా ఓటిటిలో రిలీజ్ అవుతున్నాయి. ఇప్పటికే నాని- సుధీర్ బాబు వి మూవీ రిలీజ్ అయి ఎవరేజ్ టాక్ తెచ్చుకుంది. అయితే రిలీజ్ కి రెడీగా ఉన్న మోస్ట్ వాంటెడ్ సినిమాల్లో అనుష్క “నిశ్శబ్దం” కూడా ఒకటి. ఈ సినిమాలో అనుష్క ప్రధాన పాత్రలో నటించడం, పైగా సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ కావడంతో పాటు అనుష్క క్యారెక్టర్ వైవిధ్యంగా ఉండబోతుందనే వార్తలు వస్తుండటం.. అలాగే సినిమాలో ఓ మర్డర్ చుట్టూ తిరిగే సస్పెన్స్ సీన్స్ సినిమాలోనే మెయిన్ హైలైట్ గా ఉంటాయనే అంచనాలు ఉండటంతో ఈ సినిమా కోసం ప్రేక్షకులు బాగా ఇంట్రెస్ట్ గా ఎదురుచూస్తున్నారు.

అయితే ‘నిశ్శబ్దం’ రిలీజ్ పై ఇంకా క్లారిటీ రాలేదు. నిజానికి ఈ సినిమా గత ఏడాదే విడుదల అవ్వాలి. మేకర్స్ కూడా అప్పట్లో రిలీజ్ డేట్ ను కూడా ఎనౌన్స్ చేసి.. ఆ తరువాత కొన్ని కారణాల వల్ల.. జనవరి లాస్ట్ వీక్ కి రిలీజ్ డేట్ పోస్ట్ ఫోన్ అయిందని అనుష్క టీమ్ వివరణ ఇచ్చింది. చివరకు ఆ డేట్ కూడా మిస్ అవడం, ఆ తరువాత ఇక కరోనా రావడంతో సినిమా రిలీజ్ ఆగిపోయింది. అయితే ఈ సినిమాని డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ చేయాలని నిర్మాత కోన వెంకట్ ప్లాన్ చేసుకున్నారని.. త్వరలోనే ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ లో విడుదలకు రెడీ చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తలను చిత్రబృందం ఎప్పుడు అధికారికంగా ప్రకటిస్తోందో చూడాలి.

తాజా వార్తలు