‘లవ్ స్టోరీ’ ఈ రోజు నుండే మొదలు !

‘లవ్ స్టోరీ’ ఈ రోజు నుండే మొదలు !

Published on Sep 7, 2020 10:10 AM IST

నాగచైతన్య హీరోగా నేచురల్ బ్యూటీ సాయిపల్లవి హీరోయిన్ గా వస్తోన్న సినిమా ‘లవ్ స్టోరీ’. ఇప్పటికే 90 % షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా.. ఈ రోజు నుండి బ్యాలెన్స్ షూటింగ్ కి రెడీ అయింది. ఈ సందర్భంగా చిత్రబృందం షూటింగ్ గురించి అధికారికంగా ప్రకటిస్తూ.. ‘కేవలం పదిహేను సభ్యులతో మాత్రమే షూట్ చేస్తున్నామని, అలాగే సింగిల్ షెడ్యూల్ లోనే షూట్ పూర్తి చేస్తామని.. ప్రభుత్వం చెప్పినట్లుగానే అన్ని నియమనిబంధనలకు అనుగుణంగానే షూట్ చేస్తున్నామని, సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ షూట్ స్టార్ట్ చేస్తున్నామని మేకర్స్ పోస్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించారు. ఇప్పుడు చేస్తున్న షెడ్యూల్ లో ఈ సినిమాలోని కీలకమైన క్లైమాక్స్ సన్నివేశాలు అన్నిటినీ షూట్ చేస్తారట.

ఇక శేఖర్ కమ్ముల ఫిదా లాంటి సెన్సేషనల్ హిట్ అందుకున్న తర్వాత మళ్ళీ ఎలాంటి కథతో వస్తాడా అని అందరిలో ఆసక్తి ఉన్న సమయంలో ఆ ఆసక్తిని డబుల్ చేస్తూ ఈ క్రేజీ కాంబినేషన్ తో ఈ సినిమా చేస్తోన్నాడు. కాగా డిస్ట్రిబ్యూటర్స్ గా ఇప్పటి వరకూ వందలాది సినిమాలను రిలీజ్ చేసిన ఏసియన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఈ చిత్రంతో ఫస్ట్ టైమ్ నిర్మాణ రంగంలోకి అడుగు పెడుతుంది. పైగా శేఖర్ కమ్ముల ఎంచుకున్న కాస్ట్ కూడా ప్రాజెక్ట్ కు పెద్ద ఎస్సెట్ అయింది. ఈ సినిమా పై ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలే ఉన్నాయి.

తాజా వార్తలు