రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రాబోతున్న సినిమా ‘రాధే శ్యామ్’. అయితే తాజాగా రాధాకృష్ణ కుమార్, ప్రభాస్ గురించి.. ఈ సినిమా గురించి ట్వీట్ చేస్తూ.. ‘అవును, మా డార్లింగ్ ను డైరెక్ట్ చేయడం నా డ్రీమ్. సెట్ లో ప్రభాస్ తో కలిసి చేస్తుంటే సంపూర్ణమైన గొప్ప ఆనందం. వచ్చే ఏడాది ఖచ్చితంగా థియేటర్లలో మనం ఈ సినిమా చూస్తాం. రాధే శ్యామ్ లో డార్లింగ్స్ లుక్స్ అతిపెద్ద ప్రధాన ఆకర్షణ అవుతుంది
ఇక ఈ సినిమా పీరియాడిక్ మూవీ కావడంతో పూజా గెటప్ కూడా ఆనాటి ట్రెడిషనల్ క్లాసిక్ డాన్సర్ ను పోలి ఉంటుందట. కాగా రివేంజ్ స్టోరీతో సాగే ఓ థ్రిల్లింగ్ ప్రేమకథగా రానున్న ఈ సినిమా లాక్ డౌన్ కి ముందు జార్జియాలో చిత్రీకరణ జరుపుకుంది. కానీ ఇప్పుడు మళ్లీ అక్కడ షూట్ చేసే పరిస్థితి లేదు. అందుకే మిగిలిన బ్యాలెన్స్ పార్ట్ షూట్ ను హైదరాబాద్ లోని అల్యూమినియమ్ ఫ్యాక్టరీలో అక్టోబర్ నుండి షూట్ చేయనున్నారు. కాగా మూడు భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రాన్నీ గోపికృష్ణ మూవీస్ , యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
1. Yes it’s my dream to direct our Darling, it’s an absolute pleasure working with him on set.
2. We will definitely see u guys in theatres next year.
3. Darlings looks will be the biggest asset of RadheShyam— Radhaa Krishna (@director_radhaa) September 6, 2020