ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో రోజురోజుకూ అసంతృప్తి ఎక్కువైతుంది. పైగా ఆ అసంతృప్తి రాజమౌళి మీద. ‘ఆర్ఆర్ఆర్’లోని తారక్ ఫస్ట్ లుక్ వీడియోను జక్కన్న ఎప్పుడు రిలీజ్ చేస్తాడా అని ఆశగా ఎదురుచూస్తున్న తారక్ ఫ్యాన్స్.. లేట్ అయ్యేకొద్దీ నిరాశ చెందుతున్నారు. సినిమాలో ఎన్టీఆర్ ఎలా కనిపించబోతున్నాడు, ఇంతకీ జక్కన్న ఎలాంటి వీడియోను రిలీజ్ చేయనున్నాడు.. ఇలా ఎన్టీఆర్ ఫ్యాన్స్ గత కొన్ని నెలల నుండి సోషల్ మీడియాలో కామెంట్స్ చేసుకుంటూ కోపం వచ్చినప్పుడు ట్రోల్ చేస్తూ వస్తున్నారు.
ఇక ఎన్టీఆర్ ఈ సినిమాలో మొత్తం రెండు గెటప్స్ లో కనిపిస్తాడట. తెలంగాణ యాసలో ఎన్టీఆర్ పలికే డైలాగ్ లు చాలా కొత్తగా ఉంటాయట. కాగా రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజులా, తారక్ కొమరం భీంలా నటిస్తున్న సంగతి తెలిసిందే. మొత్తానికి రాజమౌళి ఈ చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో రూపొందిస్తున్నాడు. కాగా ‘బాహుబలి’ తరవాత జక్కన్న చేస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రం పై ఆరంభం నుండి భారీ అంచనాలు భారతీయ అన్ని సినీ పరిశ్రమల్లో నెలకొన్నాయి.