‘బిగ్ బాస్ 4’ ఫైనల్ లిస్ట్ వీళ్ళే !

‘బిగ్ బాస్ 4’ ఫైనల్ లిస్ట్ వీళ్ళే !

Published on Sep 6, 2020 10:00 PM IST

‘బిగ్ బాస్ 4’ బుల్లి స్క్రీన్ ను ఉరూతలు ఊగించడానికి మొదలైపోయింది. నేడు ఎట్టకేలకు బిగ్ బాస్ సీజన్ 4 మొదటి ఎపిసోడ్ ప్రారంభం అయింది. కంటెస్టెంట్ల పరిచయ అవ్వడం వాళ్లు హౌస్ లోకి కూడా వెళ్లడం జరిగిపోయింది. ఇంతకీ సీజన్ 4 కంటెస్టెంట్ల ఫైనల్ లిస్ట్ ఒకసారి చూద్దాం. ముందుగా లీక్ అయిన కంటెస్టెంట్ల లిస్ట్ లోని సభ్యులే ఫైనల్ లిస్ట్ లోనూ ఉన్నారు.

వారి పేర్లు చూస్తే.. మోనాల్ గజ్జర్, సూర్య కిరణ్, దేవి నాగవల్లి, లాస్య మంజునాథ్, హీరో అభిజీత్ దుద్దల, జోర్దార్ సుజాత‌, మెహబూబ్ దిల్సే, అలేఖ్య హరిక, సైయద్ సోహాలి, యాంకర్ అరియానా గ్లోరీ, అమ్మ రాజశేఖర్, కరాటే కళ్యాణి, నోయెల్ సీన్, దివ్య వధ్య (దివి), అఖిల్ సార్థక్, గంగవ్వ.

ఇక ఈ సారి బిగ్ బాస్ సీజన్ 4కు కూడా హోస్ట్ గా అక్కినేని నాగార్జున చేస్తున్న సంగతి తెలిసిందే. గత సీజన్ లోనూ హోస్ట్ గా చేసి షోకి టాప్ టీఆర్పీ రేటింగ్ ను అందించిన నాగార్జున, మళ్ళీ ఈ సారి కూడా ఫుల్ ఎంటర్టైన్మెంట్ ను అందించడానికి కంటెస్టెంట్లతో సహా రెడీ అయిపోయాడు. కంటెస్టెంట్స్ చూస్తుంటే పూర్తి భిన్నమైన వ్యక్తులుగా ఉన్నారు. మరి వీరి నుండి ఎలాంటి ఫన్ వస్తోందో చూడాలి.

తాజా వార్తలు