బాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ రీమేక్ చిత్రానికి డేట్?

బాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ రీమేక్ చిత్రానికి డేట్?

Published on Sep 6, 2020 10:17 PM IST

ప్రస్తుతం బాలీవుడ్ నుంచి పలు భారీ చిత్రాలే ఓటిటిలో విడుదల అవుతున్నాయి. ఇప్పటికే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వారు చాలా సినిమాలను అందిస్తున్నారు. అలా ఇప్పటికే పలు భారీ చిత్రాలను కూడా విడుదల చేసారు. అయితే వీటిలో ఒక చిత్రం మాత్రం మంచి మోస్ట్ అవైటెడ్ ది ఉంది. అదే బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన “లక్ష్మి బాంబ్”.

తమిళ్ మరియు తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ అయిన కాంచన చిత్రానికి రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా కోసం బాలీవుడ్ వర్గాలు ఎంతగానో ఎదురు చూశాయి. కానీ ఫైనల్ గా ఓటిటి రిలీజ్ కు ఒకే చెప్పింది. కానీ ఎప్పుడు డిజిటల్ రిలీజ్ చేస్తారు అన్నది అనౌన్స్ చెయ్యలేదు. అయితే ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ప్రకారం వచ్చే దీపావళి కానుకగా నవంబర్ 13న ఈ లక్ష్మి బాంబ్ పేలనున్నట్టుగా గట్టి బజ్ వినిపిస్తుంది. మరింత సమాచారం రావాల్సి ఉన్నా ఈ చిత్రం కోసం మాత్రం స్ట్రీమింగ్ వీక్షకులు ఎక్కువగానే ఆసక్తి కనబరుస్తున్నారు.

తాజా వార్తలు