“ఆదిపురుష్”కు ఓంరౌత్ ప్లానింగ్ ను గమనించారా?

“ఆదిపురుష్”కు ఓంరౌత్ ప్లానింగ్ ను గమనించారా?

Published on Sep 5, 2020 2:53 PM IST

ఇప్పుడు డార్లింగ్ హీరో ప్రభాస్ చేయనున్న డైరెక్ట్ బాలీవుడ్ ఫిల్మ్ “ఆదిపురుష్”. బాలీవుడ్ ఫిలిం మేకర్ ఓంరౌత్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాలని రంగం సిద్ధం సిద్ధం చేస్తున్నారు. అయితే ఈ చిత్రం మన దేశపు పురాణాలకు చెందిన రామాయణ గాథ ఆధారంగా తెరకెక్కించనున్నారన్న సంగతి అందరికీ తెలిసిందే.

అందుకు తగ్గట్టుగానే దర్శకుడు ఓంరౌత్ కూడా ప్లానింగ్ ఎప్పటికప్పుడు పక్కా క్లారిటీతో అప్డేట్లు ఇస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఇచ్చిన రెండు పెద్ద అప్డేట్స్ ఒకటి రామునిగా ప్రభాస్ రావణునిగా సైఫ్ కనిపించనున్నారని ప్రత్యేకమైన పోస్టర్స్ ను డిజైన్ చేయించి మరీ తెలుపుతున్నారు. అలాగే రామాయణంలోని ప్రధాన అంశం అంటేనే రామ, రావణుల మధ్య తప్పనిసరి యుద్ధం.

అందుకే మొదట ఈ ఇద్దరినే పరిచయం చేస్తూ ఈ రెండు పోస్టర్స్ ను వదిలారు. ఈ రెండు పోస్టర్స్ ను కనుక మీరు సరిగ్గా గమనించినట్టయతే ఓ డిటైల్ మనకి అర్ధం కావచ్చు.ప్రభాస్ ను పరిచయం చేసిన పోస్టర్ వర్ణం ఉదయించే ఎర్రటి సూర్యకాంతి వలె ఉంది. అలాగే సైఫ్ అలీ ఖాన్ ను రావణునిగా పరిచయం చేసిన పోస్టర్ మొత్తం నీలి వర్ణంలో ఉంది.

అంటే ఒకటి పాత్రను పరిచయం చేస్తూనే మరొకరితో వైరం ఉందనే చూపిస్తున్నారు. ఎలా అంటే శ్రీరాముణ్ణి “నీలి మేఘ శ్యాముడు” అని కూడా అంటారు.కానీ ఈ నీలి వర్ణాన్ని రావణ పాత్రను పరిచయం చేస్తూ చూపించారు అలా అనుకోవచ్చు. మరి ఓంరౌత్ ప్లానింగ్ ఇదేనా లేక అలా డిజైన్ చెయ్యడం వెనుక ఇంకేమన్నా అర్ధం ఉందా తెలియాలి.

తాజా వార్తలు