చాలా కాలం గ్యాప్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాల్లోకి వచ్చి మళ్ళీ చాలా కాలం బిజీగా గడపనున్నారు. వరుస పెట్టి మొత్తం నాలుగు చిత్రాలను లైన్ లో పెట్టేసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి టాలీవుడ్ టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యారు. ఇప్పటికే పాలిటిక్స్ మరియు సినిమాల్లో బిజీగా ఉన్న పవన్ ఇప్పుడు మరో రంగంపై ఆసతి చూపుతున్నారట.అయితే ఈ లాక్ డౌన్ సమయంలో డిజిటల్ ప్రపంచం మరింత స్థాయిలో అభివృద్ధి చెందింది.
అలా ఈ ఖాళీ సమయంలోనే చాలా మంది జీవితాల్లో అనేక మార్పులు వచ్చాయి. అయితే ఈ సమయంలో పవన్ చాలానే సినిమాలు, మన దేశపు మరియు ఇతర దేశాల వెబ్ సిరీస్ లు చూశారట. దీనితో అక్కడ నుంచి ఆయన వెబ్ సిరీస్ లు అంటే కాస్త ఆసక్తి చూపుతున్నారట. అయితే పవన్ ఆసక్తి చూపుతున్నా సరే పవన్ నుంచి ఒక వెబ్ సిరీస్ కు వస్తుంది రాదు అన్నది మాత్రం ఖచ్చితంగా కాలమే నిర్ణయించాలి. మరి పవన్ నుంచి వెబ్ సిరీస్ కూడా వస్తుందో లేదో చూడాలి.