మహేష్ ప్లాప్ సినిమాతో సెన్సేషనల్ రికార్డ్.!

మహేష్ ప్లాప్ సినిమాతో సెన్సేషనల్ రికార్డ్.!

Published on Sep 4, 2020 8:15 AM IST

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన ఎన్నో చిత్రాలలో బ్లాక్ బస్టర్ హిట్లూ ఉన్నాయి అలాగే పరాజయాలు కూడా ఉన్నాయి. అయితే వీటిలో ఆల్రెడీ హిట్ కాబడిన సినిమాలతో వచ్చే కిక్కు ఏమో కానీ ఊహించని విధంగా ప్లాప్ కాబడిన సినిమాతో భారీ రికార్డు నెలకొల్పితే? అందులోను మన ఇండియాలోనే అది ఒక సెన్సేషనల్ రికార్డు అయితే దాని ఇంపాక్ట్ ఏ రేంజ్ లో ఉంటుందో మహేష్ కెరీర్ లో ప్లాప్ గా నిలిచిన “ఆగడు” చిత్రం నిరూపించింది.

అప్పటికి మహేష్ హిట్ దర్శకుడు శ్రీను వైట్లతో సెట్ చేసిన ఈ డెడ్లీ కాంబోపై నెలకొన్న అంచనాలు అన్ని ఇన్ని కావు. కానీ ఈ చిత్రం మాత్రం అన్ని అంచనాలను అందుకోలేకపోయింది. అయితే ఇపుడు ఇదే సినిమా హిందీ డబ్బింగ్ వెర్షన్ మాత్రం యూట్యూబ్ లో ఏకంగా 500 మిలియన్ వ్యూస్ మార్క్ అందుకొని సెన్సేషనల్ రికార్డును నెలకొల్పినట్టు తెలుస్తుంది. హిందీ డబ్బింగ్ లో విడుదల చేయబడ్డ అన్ని వెర్షన్ల తాలూకా వ్యూస్ అన్ని కలిపితే ఈ చిత్రం 500 మిలియన్ వ్యూస్ వచ్చి పడ్డాయి. ఈ మార్క్ కూడా బహుశా ఇండియన్ సినిమాలో అందులోను ఒక ప్లాప్ సినిమాకు మొదటి సారే అని చెప్పాలి.

తాజా వార్తలు