కోవిడ్ నుంచి కోలుకున్న హాలీవుడ్ స్టార్ హీరో కుటుంబం!

కోవిడ్ నుంచి కోలుకున్న హాలీవుడ్ స్టార్ హీరో కుటుంబం!

Published on Sep 3, 2020 10:49 AM IST

ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా ఫీవర్ సినీ వర్గాలలో కూడా చేరిపోయింది. ఏ చిత్ర పరిశ్రమను కూడా వదలకుండా అన్ని చోట్లా కరోనా వచ్చేసింది. అలా హాలీవుడ్ స్టార్ హీరోలకు సైతం ఈ కోవిడ్ వైరస్ సోకింది. మన ఇండియన్ మరియు తెలుగు ఆడియెన్స్ కు ఎంతో సుపరిచితం అయిన హాలీవుడ్ స్టార్ హీరోలలో డ్వైన్ జాన్సన్ అలిజాయ్ రాక్ కూడా ఒకరు.

డబ్ల్యూ డబ్ల్యూ నుంచి పరిచయం కాబడిన ఈ హీరో హాలీవుడ్ లో వన్ ఆఫ్ ది హైయెస్ట్ పైడ్ యాక్టర్ కూడా. అయితే అతనికి మరియు అతని భార్య సహా ఇద్దరు పిల్లకు మూడు వారాల కితం కరోనా పాజిటివ్ వచ్చిందట. ఇపుడు వారంతా పూర్తిగా కోలుకున్నట్టు తెలుస్తుంది.

అయితే రాక్ తన ఫాలోవర్స్ ను ప్రతీ ఒక్కరినీ తమ రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలని జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అయితే రాక్ “ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్” సిరీస్ “జర్నీ 2”, “ది ఎక్పాండబుల్స్” ,”రాంపేజ్” లేటెస్ట్ గా “జ్యూమాంజి” లాంటి ఎన్నో భారీ చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే.

తాజా వార్తలు