ఈరోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కావడంతో ఎన్నడూ లేని విధంగా కేవలం ఈ ఒక్కరోజునే తాను నటించనున్న నాలుగు చిత్రాల తాలూకా అప్డేట్స్ వరుస పెట్టి వచ్చేసాయి. దీనితో పవన్ అభిమానులకు ఎక్కడ లేని ఆనందం వచ్చింది. అయితే ఈరోజు అనౌన్స్ చేసిన ప్రతీ ఒక్క అప్డేట్ కూడా ఒకదానిని మించి మరొకటి అని చెప్పాలి.
వకీల్ సాబ్ హోం మొదలు కొని ఇప్పుడు పవర్ స్టార్ సాలిడ్ కాంబో అయినటువంటి హరీష్ శంకర్ ప్రాజెక్ట్ తో ఎండ్ అయ్యింది. చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారు అనుకున్న సమయానికే అదిరిపోయే అధికారిక అప్డేట్ ను ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ లో ఢిల్లీ గేట్ అందులో సర్దార్ వల్లభ భాయ్ మరియు నేతాజీల ఫోటోలు.
అలా కిందకు వస్తే ఒక బైక్ దాని వెనుక పెద్ద బాల శిక్ష అందులో గులాబీ పువ్వు.కింద ఒక ట్యాగ్ “ఈసారి ఒక్క ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు” అని పెట్టారు. ఇవన్నీ చూస్తుంటే హరీష్ శంకర్ పవన్ నుంచి ఏదో కొత్త కోణాన్నే చూపించబోతున్నారనిపిస్తుంది. ఇక ఈ చిత్రానికి కూడా వీరి హిట్ కాంబో దేవిశ్రీ ప్రసాదే సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.