నేడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కావడంతో అటు ఆన్లైన్ మరియు ఆఫ్ లైన్ లో పవన్ అభిమానులు సంబరాలు చేసుకునేందుకు ఎన్నో ప్లానింగ్స్ వేసుకున్నారు. కానీ ఊహించని విధంగా చిత్తూరు జిల్లాకు చెందిన పలువురు పవన్ అభిమానులు ఫ్లెక్స్ కడుతుండగా విద్యుత్ ఘాతానికి గురయ్యిన ఘటన పవన్ ను ఎంత గానో కలచివేసింది. దీనితో పవన్ మరణించిన వారి కుటుంబాలను మరియు గాయపడిన వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
అయితే పవన్ నటిస్తున్న తాజా చిత్రం “వకీల్ సాబ్” చిత్ర యూనిట్ కూడా ఈ దిగ్భ్రాంతి గొల్పిన ఘటనపై స్పందిస్తూ తాము పవన్ అభిమానులు చనిపోవడం చాలా బాధాకరంగా ఉందని గాయపడిన వారు కూడా తొందరగా కోలుకోవాలని మృతి చెందిన కుటుంబాలకు 2 లక్షల చొప్పున ఆర్ధిక సాయాన్ని అందిస్తామని అధికారికంగా ప్రకటించారు.నిర్మాత దిల్ రాజు సంస్థ అయినటువంటి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ వారు పోస్ట్ చేసారు. వారితో పాటు గాయపడిన వారికి కూడా తమ ప్రఘాడ సానుభూతి తెలియజేస్తున్నామని వారు తెలిపారు.
— Sri Venkateswara Creations (@SVC_official) September 2, 2020