ఈ మెగా హీరోతో మెగా పవర్ స్టార్ సినిమా?

ఈ మెగా హీరోతో మెగా పవర్ స్టార్ సినిమా?

Published on Sep 2, 2020 3:00 AM IST


మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తన కెరీర్ లో ఒక్క హీరోగానే కాకుండా తన సొంత నిర్మాణ సంస్థ కొణిదెల ప్రొడక్షన్స్ తో నిర్మాతగా కూడా భారీ సినిమాలు కూడా చేస్తున్నారు. కానీ ఈ మధ్యలోనే చరణ్ తన కెరీర్ ను బ్యాలెన్సుడ్ గా కొనసాగించాలని చరణ్ కు చిరు సూచించారు. దీనితో అక్కడి నుంచి చరణ్ మీడియం బడ్జెట్ చిత్రాలు చేయాలని చరణ్ ప్లాన్ చేసుకున్నట్టు తెలిసింది. ఇపుడు అందులో భాగంగానే చరణ్ మరో మెగా హీరోతో ఓ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నట్టుగా టాక్ వినిపిస్తుంది.

సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ తో రామ్ చరణ్ తన నిర్మాణ సంస్థలో ఒక సినిమాను ప్లాన్ చెయ్యాలనే యోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఇది ఇంకా మొదలు కావడానికి సమయం ఉన్నా ఇంకా ఎలాంటి ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నారు అన్నది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం చరణ్ “రౌద్రం రణం రుధిరం” మరియు “ఆచార్య” చిత్రాలలో నటిస్తుండగా, సాయి తేజ్ “సోలో బతుకే సో బెటర్” మరియు సుకుమార్ రైటింగ్స్ లో ఒక చిత్రంలో నటిస్తున్నారు. బహుశా ఏఈ చిత్రాన్ని వీటి తర్వాత ప్లాన్ చేయొచ్చేమో.

తాజా వార్తలు