పవన్ పుట్టిన రోజు వేడుకల్లో విషాదం… దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పవన్!

పవన్ పుట్టిన రోజు వేడుకల్లో విషాదం… దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పవన్!

Published on Sep 1, 2020 11:00 PM IST

జన సేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ పుట్టిన రోజున పురస్కరించుకొని అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకోవడం అందరికీ తెలిసిందే. అయితే ఈ సారి పుట్టిన రోజు వేడుకల్లో విషాదం నెలకొంది. చిత్తూరు జిల్లా, కుప్పం లో శాంతి పురం వద్ద కటౌట్ కడుతూనే విద్యుత్ షాక్ కి గురి అయి ముగ్గురు దుర్మరణం చెందారు. దాదాపు 25 అడుగుల ఫ్లెక్సీ కడుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

అయితే మరణించిన వారి లో ఇద్దరు అన్నదమ్ములు ఉండటం తో ఆ ప్రాంతం లో విషాదం నెలకొంది. ఈ ప్రమాదం లో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. నలుగురి పరిస్థితీ విషమం గా ఉంది. మరణించిన వారిని సోమశేఖర్, రాజేంద్ర, అరుణాచలం లు గా గుర్తించారు. అయితే ఈ ఘటన పై పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించారు. జన సైనికుల మరణం మాటలకు అందని విషాదం అని పేర్కొన్నారు. గుండెల నిండా అభిమానం నింపుకున్న తన అభిమానుల మరణం తనను తీవ్ర దిగ్భ్రాంతి కి గురి చేసినట్లు తెలిపారు.

అయితే ఈ విషయం తన మనసును తీవ్రం గా కలచివేసింది అని, మాటలకు అందని విషాదం అని అన్నారు. దూరమైన బిడ్డలను తీసుకురాలేము గనుక వారి తల్లిదండ్రులకు తాను ఒక బిడ్డగా నిలుస్తాను అని, ఆర్ధికం గా ఆ కుటుంబాలను ఆదుకుంటా అని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. మృతుల ఆత్మ కి శాంతి చేకూరాలని, తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ఘటన లో బాధితులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలి అని స్థానిక నాయకులకి తెలిపినట్లు సమాచారం. బాధిత కుటుంబాలకు తక్షణ సహాయ చర్యలు అందేలా చూడాలని పవన్ కళ్యాణ్ స్థానిక నాయకులకి సూచించారు.

తాజా వార్తలు