పవర్ స్టార్ నుంచి ట్రిపుల్ ధమాకా..!

పవర్ స్టార్ నుంచి ట్రిపుల్ ధమాకా..!

Published on Sep 1, 2020 4:30 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమాలకు సంబంధించి ఇంతకు మునుపు ఎన్నడూ లేని విధంగా ఒకేసారి వరుస అధికారిక అప్డేట్లతో రచ్చ లేవనుంది. ఈ సెప్టెంబర్ 2 వ తారీఖుతో పవన్ పుట్టినరోజు కావడంతో భారీ ట్రెండ్ ను కూడా పవన్ అభిమానులు ప్లాన్ చేసారు. అలాగే ఇదే సమయంలో మరోపక్క పవన్ నటిస్తున్న సినిమాలకు సంబంధించి కూడా అప్డేట్ల కోసం వారు ఎదురు చూస్తుండగా ఊహించిన విధంగానే ట్రిపుల్ ఫీస్ట్ కు రంగం సిద్ధం అయ్యింది.

మొదటగా తాను నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “వకీల్ సాబ్” నుంచి చిత్ర యూనిట్ ఉదయం 9 గంటల 9 నిమిషాలకు ఒక సర్ప్రైజ్ ను ప్లాన్ చెయ్యగా, ఆ తర్వాత మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు క్రిష్ తో నటిస్తున్న తన 27 వ చిత్రానికి సంబంధించి ఒక స్పెషల్ పోస్టర్ రానుండగా సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు తన బ్లాక్ బస్టర్ కాంబో హరీష్ శంకర్ ప్రాజెక్ట్ కు సంబంధించి ఒక అధికారిక అనౌన్స్మెంట్ రానుంది. ఈ దెబ్బతో పవర్ స్టార్ నుంచి ట్రిపుల్ ధమాకా కన్ఫర్మ్ అయ్యిందని చెప్పాలి.

తాజా వార్తలు