తారక్ సినిమాకు కూడా చిరు సినిమాలానే చేస్తారా?

తారక్ సినిమాకు కూడా చిరు సినిమాలానే చేస్తారా?

Published on Sep 1, 2020 6:05 PM IST

ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ దర్శక ధీరుడు రాజమౌళితో “రౌద్రం రణం రుధిరం” అనే భారీ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ లో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఈ చిత్రం తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మరియు కన్నడ పవర్ ఫుల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ లతో పవర్ ఫుల్ ప్రాజెక్టులలో తారక్ నటించనున్నారు.

అయితే తారక్ చేస్తున్న ఈ మూడు ప్రాజెక్టులకు సంబంధించి అప్డేట్స్ మాత్రం అరకొరగానే వినిపిస్తున్నాయి. అలాగే ఇటీవలే త్రివిక్రమ్ తో చేయనున్న ప్రాజెక్ట్ కు సంబంధించి మాత్రం లేటెస్ట్ టాక్ వినిపించింది. టైటిల్ మరియు ఇతర అంశాలను షూటింగ్ మొదలు పెట్టే ముందే తెలుపుతామని అన్నారు. అయితే ఇది చూస్తుంటే మెగాస్టార్ చిరు నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “ఆచార్య” లానే అనిపించొచ్చు.

ఈ చిత్రం టైటిల్ విషయంలో కూడా మేకర్స్ మొన్న అధికారిక ప్రకటన చేయక ముందే ఫిల్మ్ ఛాంబర్ లో రిజిస్టర్ చేసిన టైటిల్ ఆధారంగా మారలేదు. ఇక అలాగే తారక్ మరియు త్రివిక్రమ్ ల కాంబోలో వచ్చే సినిమాకు కూడా అప్పుడే “అయినను పోయి రావలె హస్తినకు” అనే టైటిల్ ను రిజిస్టర్ చేసినట్టుగా తెలిసింది. మరి బహుశా ఒకవేళ చిత్రం స్టార్ట్ చేసినపుడు కూడా మెగాస్టార్ సినిమాలనే అదే టైటిల్ ను అనౌన్స్ చేసినా పెద్ద ఆశ్చర్యం లేదని చెప్పాలి.

తాజా వార్తలు