యూవీ క్రియేషన్స్ అదినేతల్లో ఒకరైన ప్రముఖ నిర్మాత వంశీకి పితృవియోగం కలిగింది. ఆయన తండ్రి నిన్న రాత్రి హైదరాబాద్ లో గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన మృతదేహాన్ని ఆయన స్వస్థలం నెల్లూరుకి నిన్న రాత్రి తీసుకువెళ్లారు. వయసు పై బడటం కారణంగా ఆయన గత కొంతకాలంగా అనారోగ్య సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారని తెలుస్తోంది. ఈ సంఘటనతో నిర్మాత వంశీ తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ప్రభాస్ చిత్రాలను ఎక్కువగా యూవీ క్రియేషన్స్ నే నిర్మిస్తూ వస్తున్నారు.
యూవీ క్రియేషన్స్ నిర్మాతలుగా ప్రమోద్, వంశీ ప్రభాస్ కి అత్యంత సన్నిహితులు కూడా. యూవీ క్రియేషన్స్ అనగానే భారీ సినిమాలు గుర్తుకొస్తున్నాయంటే.. ఆ బ్యానర్ కు ఆ స్థాయిను తీసుకురావడానికి వంశీ చేసిన కృషి ఎంతో ఉంది. ప్రస్తుతం మరో రెండు ప్రాజెక్ట్స్ లను కూడా యూవీ క్రియేషన్స్ వంశీ నిర్మించే ప్లాన్ లో ఉండగా.. వంశీ తన తండ్రిని కోల్పోవడం బాధాకరం.123తెలుగు.కామ్ తరఫున వంశీ తండ్రిగారి మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, శోహార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము.