టీఆర్పీతో మరో ఆల్ టైం రికార్డ్ సెట్ చేసిన బన్నీ సినిమా.!

టీఆర్పీతో మరో ఆల్ టైం రికార్డ్ సెట్ చేసిన బన్నీ సినిమా.!

Published on Aug 28, 2020 1:33 AM IST


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కించిన హ్యాట్రిక్ చిత్రం “అల వైకుంఠపురములో”. ఈ చిత్రం విడుదల కాక ముందు నుంచే ఎన్నో సంచలన రికార్డులను కొల్లగొట్టేసింది. అలా ఇన్నాళ్లు అయినా సరే స్మాల్ స్క్రీన్ పై అయితే ఊహించని విధమైన సునామీని సృష్టించింది.

ఏకంగా 29.04 టీఆర్పీ రేటింగ్ ను రాబట్టి ఆల్ టైం రికార్డును నెలకొల్పింది. ఇప్పుడు ఇదే అనుకుంటే అంతకు మించిన రికార్డును ఈ చిత్రం కొల్లగొట్టినట్టు తెలుస్తుంది. గత రెండు వారల కితం టెలికాస్ట్ కాబడిన ఈ చిత్రం ఏకంగా 2 కోట్ల 19 లక్షల వ్యూవర్ షిప్స్ ను రాబట్టిందట. ఇది మాత్రం మొత్తం మన దక్షిణ భారదేశంలోనే ఏ చిత్రానికి రానట్టు తెలుస్తుంది. దీనితో కేవలం ఒక్క ఆల్ టైం రికార్డు తోనే మొత్తం మన దక్షిణాదిలోనే మరో ఆల్ టైం రికార్డును ఈ చిత్రం సెట్ చేసింది అని చెప్పాలి.

తాజా వార్తలు