“ఆచార్య” స్టోరీ కాపీ ఇష్యూను తేల్చేసిన నిర్మాణ సంస్థ.!

“ఆచార్య” స్టోరీ కాపీ ఇష్యూను తేల్చేసిన నిర్మాణ సంస్థ.!

Published on Aug 27, 2020 4:25 PM IST

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న భారీ చిత్రం “ఆచార్య”. మెగా ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ మరియు మోషన్ పోస్టర్ ను ఇటీవలే చిరు పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయగా దానికి భారీ రెస్పాన్స్ వచ్చింది.

అయితే సరిగ్గా అక్కడి నుంచే ఈ చిత్రానికి కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. ఈ చిత్రం కథ కాపీ చేయబడినది అని అనేక రకాల వదంతులు వినిపించాయి. కానీ వీటన్నిటిని ఖండిస్తూ చిత్ర నిర్మాణ సంస్థ అయినటువంటి మాట్ని ఎంటెర్టైనెంట్స్ వారు ఒక అధికారిక ప్రెస్ నోట్ ను విడుదల చేసి తెలిపారు.

ఈ చిత్రానికి సంబంధించిన కథ పూర్తిగా దర్శకుడు కొరటాల శివ మాత్రమే రాసుకున్నారని అలాంటిది ఆయన కాపీ కొట్టారని వస్తున్న వదంతులు అన్ని బేస్ లెస్ అని ఖరాఖండీగా చెప్పేసారు. అలాగే ఇవన్నీ కేవలం డీఫేమ్ చెయ్యడానికే చేస్తున్నారని ముగించేశారు. కొరటాల తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఏఈ భారీ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది వేసవి కానుకగా విడుదల కానుంది.

తాజా వార్తలు